-
-
చిట్టగాంగ్ విప్లవ వనితలు
Chittagang Viplava Vanitalu
Author: Chaithanya Pingali
Publisher: Janaharsha Publishers Pvt. Ltd.
Pages: 177Language: Telugu
2016 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన పుస్తకం!
*****
ఇవ్వాళ.. ప్రతి అంశాన్ని స్త్రీల దక్కోణం నుంచి చూడాల్సిందే. మన స్వాతంత్య్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. దేశానికి స్వతంత్రం రాక ముందే ఈ నేల మీద కొంత భూభాగం స్వాతంత్య్రం పొందింది. అదే చిట్టగాంగ్. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ సాధించిన ఘనత ఇది. మహిళలు రహస్య సాయుధ దళాల్లో చేరి పోరాటం సాగించిన అపురూపమైన ఘట్టం ఆ సంస్థతోనే మొదలు. అందులో తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు ఇవి.
- నమస్తే తెలంగాణ
''1930లో ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ! అందులో పనిచేస్తున్న విప్లవకారులు ఇద్దరు ఒక స్థావరంలో బ్రిటీష్ సైన్యానికి దొరికారు. లోపల ఉన్నవాళ్లు లొంగిపోవాలని... షర్ట్ విప్పి, చేతులు పైకి ఎత్తి బయటికి రావాలని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. 'నేను చీరకట్టుకుని ఉన్నాను. పైట తొలగించి బయటికి రావాలా? అవసరం లేదా?' అని ఓ ఆడగొంతు. ఆ గొంతులో సిగ్గు లేదు, భయం లేదు... కేవలం నిర్లక్ష్యం ప్రతిధ్వనిస్తోంది. అది బ్రిటీష్ సైనికులను ద్రిగ్భాంతికి గురి చేసింది. ఆ గొంతు చిట్టగాంగ్ విప్లవకారిణి కల్పనాదత్ది. ఆమెతో ఉన్న నాయకుడు తారకేశ్వర్! బయటికి వచ్చేముందు తారకేశ్వర్ కల్పనతో ఓ మాట అన్నాడు 'బులు నాకోసం ఎదురుచూస్తావా?' అని! బయటికి వచ్చాక తారకేశ్వర్ను ఉరితీశారు. శవాన్ని కూడా కనబడనీయలేదు. ఇచ్చిన ఒక్కమాటకోసం ఎదురుచూస్తూనే ఉంది కల్పన!'' కల్పనా మాటల్లోని ధైర్యం.. ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ... చైతన్యను కదిలించింది. అదే సమయంలో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఇలాంటప్పుడే కల్పనాలాంటి విప్లవ వనితల స్ఫూర్తిని... ఈ తరానికి అందించాలనుకుంది చైతన్య. ఫలితం... 'చిట్టగాంగ్ విప్లవ వనితలు' పుస్తకం వచ్చింది.
- నవ తెలంగాణ

- ₹75.6
- ₹60
- ₹60
- ₹60
- ₹108
- ₹60