• Chintalapativari Manmatha Nama Samvatsara Panchangam 2015 16 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • చింతలపాటివారి మన్మథ నామ సంవత్సర పంచాంగం 2015-16 (free)

    Chintalapativari Manmatha Nama Samvatsara Panchangam 2015 16 - free

    Pages: 98
    Language: Telugu
    Rating
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    '3.75/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ॥వే॥ శ్రీ చింతలపాటి వీర నీల కంఠ కుటుంబరామశాస్త్రి సిద్ధాన్తి గారి కుమారులు, శివసోమసున్దర మాధవదత్తమూర్తి సిద్ధాన్తి, హరిసూర్యసుబ్రహ్మణ్య సిద్ధాన్తి హరినారాయణ కృష్ణసిద్ధాన్తినా గార్లు రచించినది.

* * *

ఈ సంవత్సరము చైత్రము సమశీతోష్ణస్థితి కలిగి ప్రారంభమున అకాలముగా వర్షించును. వైశాఖ, జ్యేష్ఠములు గ్రీష్మాధిక్యముగా, పశ్చిమ వాతాధిక్యముగా నుండును. వైశాఖమున కొన్ని తావుల వడగండ్ల వానలు కురియును.

అధిక ఆషాఢమున స్వల్పముగా తొలకరించి, నిజాషాఢమున బీజవాపానుకూలముగా వర్షించును. శ్రావణమున సస్యానుకూల వర్షములుండును. భాద్రపద, అశ్వయుజములయందు, మధ్యమమున వర్షములుండును.

ఈ సంవత్సరము పశునాయకుడు బలరాముడు. గోష్ఠాగార ప్రాపకుడు, శ్రీకృష్ణుడు. గోష్ఠాద్బహిప్రాపకుడు కూడా శ్రీకృష్ణుడే అగుటచే పశువులకు తృణసమృద్ధి కలిగి, సుభిక్షము, పాడి పంటలు సమృద్ధిగా ఉండును.

ప్రజాపతి దేవతాకము అగు ఈ మన్మథ నామ సంవత్సరంలో ధాన్య దానము వలన మహా పుణ్యము అని శాస్త్రమునందు కలదు. ఈ సంవత్సరము తొమ్మిది వీసముల పంట, ఒక తూము వర్షము, రెండు తూములు వాయువు కలిగి ప్రజలు సర్వసౌఖ్యములు బడయుదురు.

- పంచాగకర్తలు