• Chinalo Samskrutika Viplavamuu Parisramala Nirvahanaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైనాలో సాంస్కృతిక విప్లవమూ, పరిశ్రమల నిర్వహణా

    Chinalo Samskrutika Viplavamuu Parisramala Nirvahanaa

    Author:

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చైనాలో, సాంస్కృతిక విప్లవం - 10 సంవత్సరాల 'మెరుపు'! 1966 నుంచి 76 వరకూ! ఆ కాలం చరిత్రలో ఎన్నడూ లేని అద్భుత ప్రయోగాలు చేసింది. ఆ కాలంలో చైనాలో సంభవించిన మార్పుల గురించి చార్లెస్ బెతల్ హామ్ ఫ్రెంచి భాషలో రాశారు. ఆ వ్యాసాన్ని ఆల్‌ఫ్రెడ్ ఎహ్‌రెన్‌ఫెల్డ్ ఆంగ్లంలోకి అనువదించగా, ఉదయ్ కుమార్, గాంధీ, రంగనాయకమ్మ తెలుగులోకి తర్జుమా చేసారు.

బెతల్ హమ్ వ్యాసం 5 ఛాప్టర్లుగా వుంది. అది అంతా సాంస్కృతిక విప్లవాన్ని విశ్లేషించేదిగా ఉంటుంది. అనువాదకుల వ్యాసం - సాంస్కృతిక విప్లవ కాలంలో జరిగిన అనేక సంఘటనలని ఒక క్రమంలో చూపించేదిగా వుంటుంది.

బెతల్ హామ్, చైనాని, సాంస్కృతిక విప్లవ కాలంలోనూ, ఇతర కాలాల్లోనూ, అనేక సార్లు చూసిన వ్యక్తి. ఆయన వ్యాసం - అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మిక ప్రజలతోటీ కార్మిక ఉద్యమకారుల తోటీ జరిపిన సంభాషణల ద్వారానూ, అక్కడి పత్రికల ద్వారానూ, కొన్ని రాజకీయ పత్రాల ద్వారానూ, చైనాలో తిరిగిన ఇతర పరిశోధక పర్యాటకుల ద్వారానూ సేకరించిన సమాచారాల మీద ఆధారపడినటువంటిది.

బెతల్ హామ్ వ్యాసం తర్వాత అనువాదకుల "మరి కొంత సమాచారం" వ్యాసం ఉంటుంది. అది, బెతల్ హామ్ వ్యాసంలో కనపడని అనేక సంఘటనల్ని చూపిస్తూ, నిజంగానే 'మరి కొంత సమాచారం' ఇస్తుంది.

'పరిశ్రమల నిర్వహణ'లోనూ, 'శ్రమ విభజన'లోనూ, సోషలిస్టు మార్పుల కోసం, సాంస్కృతిక విప్లవం ఇచ్చిన అనుభవాలు - కార్మిక వర్గానికి, బ్రహ్మాండమైన సంపద. రేపు ప్రతీ దేశ విప్లవానికీ ఈ అనుభవాలన్నీ మార్గ దర్శకాలే. ఆచరణలో ఎంతో కఠినంగా తోచే మార్పుల్ని, సాంస్కృతిక విప్లవం, ఊహాతీతమైనంత సులభం చేసింది. దాన్ని గ్రహించడమూ, ఆచరించడమూ, మన పని.

Preview download free pdf of this Telugu book is available at Chinalo Samskrutika Viplavamuu Parisramala Nirvahanaa