• Chikatiki Avatala
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చీకటికి అవతల

    Chikatiki Avatala

    Pages: 318
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“చెబితే విన్నావా? మంత్రాలకు మనుషులు బాగుపడరని తెలిసిందా?” కాస్త విసుగు, కొంత వెటకారం కలగలిపి భార్యను ఆక్షేపించాడు ప్రకాష్.

“ఉదయం స్వామి దండ ఇచ్చినప్పటి నుంచి సాయంకాలం అయిదు గంటల వరకు బాగానే వుంది. బిత్తరచూపులు చూడడం, పరాకుగా ఉండటం అన్నీ మాయమయ్యాయి. ఇక సర్దుకుంటుందిలే అని అనుకుంటూ వుండగానే మళ్ళీ మొదటికొచ్చింది” మాయాదేవి బాధతో చెప్పింది. భర్త తనని ఆక్షేపించిన విషయం ఆమె పట్టించుకోలేదు. స్వామి ఇచ్చిన దండ వల్ల తన ఆడబడుచు బాగుపడలేదన్న బాధే ఆమెను కలచివేస్తోంది.

“ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. ముందు అనూహ్యని తీసుకుని డాక్టర్ పద్మావతి దగ్గరకి వెళదాం పద” అని ప్రకాష్ తొందర చేశాడు.

మరో పావుగంటకు ముగ్గురూ పద్మావతీ నర్సింగ్ హోమ్ దగ్గరున్నారు.

తన ఆడబడుచులో ఇటీవల వచ్చిన మార్పునంతా చెప్పింది మాయాదేవి. “నిన్నటి నుంచి తిరిగి తలనొప్పి కూడా వస్తోందట” అంది.

డాక్టర్ పద్మావతి అనూహ్యను అంతా పరీక్షించింది. శారీరకంగా ఏ లోపమూ కనపడటం లేదు. కానీ అనూహ్య పేషెంట్ అయిపోయింది.

ప్రతి విషయంలోనూ ఎంతో కాన్షియస్‌గా వుండే అనూహ్య ఇలా పరాకుగా తయారవడం చూస్తుంటే ఆమెక్కూడా బాధ కలిగింది. అందులోనూ దగ్గర్లోనే పెళ్ళి వుంది.