• Chaso Sphurti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చాసో స్ఫూర్తి

    Chaso Sphurti

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కథా సాహిత్యంలో అభ్యుదయ ఆణిముత్యాలు చాసోకథలు. శ్రీశ్రీ ఒక పుస్తకం చాసోకి కానుకగా ఇస్తూ, ‘చాసో గోర్కీ’ అని రాసి సంతకం పెట్టాడు. ‘గోర్కీ’ అంటే చేదు అని అర్థం. సమాజంలోని చేదు నిజాలని కథలుగా చెప్పిన రచయిత చాసో. తాత్విక, నైతిక, ఫ్యూడలిజంతో కలంతో సమరం చేసిన రచయిత ఆయన. సౌందర్యం, వాస్తవికత, ముందుచూపు మేళవించి రాబోయే తరాలని తన కథలకి పాఠకులనిగా చేసుకున్న అరుదైన రచయిత చాసో. వస్తువు కనిపించేలా కథని ముస్తాబు చేసిన రచయిత ఆయన. తనమీదా తన కథలమీదా సరైన విమర్శ రాలేదని అంటూ వుండే వారాయన. రాంభట్ల కృష్ణమూర్తి వంటి విమర్శకులు తప్ప చాసోని సమగ్రంగా అర్థం చేసుకున్నవారు లేరనే చెప్పాలి.
ఎప్పుడు చదివినా, ఏదో ఒక్క కొత్త భావం చటుక్కున మెరిసినప్పుడు, ఆ మెరుపు చిరువెలుగులో ఆ చదివిన కథని నలుగురిలో పంచుకోవాలనిపించేలా ఏ కథలైతే ఉంటాయో... ఆ కథలు ‘క్లాసిక్స్’. అటువంటి రచయిత చాసో పేరుమీదుగా చాగంటి తులసిగారు వ్యవస్థాపకులుగా కొంత మంది మిత్రులం ‘చాసో స్పూర్తి’ సాహిత్య సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో ప్రసిద్ధులు ఆ సభలలో పాల్గొని, చాసో సాహిత్యాన్ని ప్రతిభావంతంగా సమీక్షించారు. ఆ ప్రసంగాల సంకలనం గ్రంథ రూపంలో తేవాలన్న మా ఆకాంక్ష యీనాటికి నెరవేరుతోంది. చాసో శతజయంతి, ‘చాసో స్పూర్తి’ రెండు దశాబ్దాల ఉత్సవాల సందర్భంగా జనవరి 17, 2015 న వెలుగులోకి తెస్తున్నాం. రసజ్ఞులు సమాదరిస్తారని ఆశిస్తూ...

- రామసూరి

Preview download free pdf of this Telugu book is available at Chaso Sphurti