• Charitralo Prabandha Parameswarudu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు

    Charitralo Prabandha Parameswarudu

    Pages: 172
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నమస్కారం. తెలుగు వన్ డాట్ కాం వారి బహుముఖ రంగాలలో సాహిత్యం విభాగంలో మొదలైన ధారావాహిక వచన కావ్యం.. “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” రచయిత్రిని. ఆంధ్ర మహా భారతం సాహితీ జీవ మహా నది ఐతే.. రెండు వేర్వేరు ఒరవడులు కలిగిన సాహితీ వాహినులను.. వేగంలో, స్వచ్ఛతలో ఎటువంటి కల్తీ లేకుండా కలిపిన జీవ నది, ఎఱ్ఱాప్రగడ కవి రచించిన అరణ్య పర్వ భాగం. స్వయంగా మొత్తం కావ్యం రాయడం వేరు.. ఇద్దరు కవుల కావ్యానికి వారధి కట్టడం వేరు.. అందుకే నాకు ఎఱ్ఱనగారి జీవిత చరిత్ర మీద కుతూహలం కలిగింది.

పది సంవత్సరాల పసి వయసులోనే క్లిష్ట పదాలతో చందో బద్ధంగా పద్యం చెప్పి తాతగారిని ఆశ్చర్య పరిచిన ఎఱ్ఱన అంటే ఆరాధన కలిగింది.

ఎఱ్ఱాప్రగడ జీవిత విశేషాలన్నీ, “ఎఱ్ఱాప్రగడ చరిత్ర” అని రాయచ్చు కదా.. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏమిటి అని సందేహం రావచ్చు.

ఎఱ్ఱాప్రగడ జీవిత కాలంలో తెలుగునాట రాజకీయ చరిత్ర అనేక మలుపులు తిరిగింది. తొలి చూలుగా వంశోద్ధారకుడు కావాలనుకునే కాలంలో.. ఎఱ్ఱన తల్లి.. “దేవుడా.. నాకు ఆడపిల్లనే ఇవ్వు” అని ప్రార్ధించిన పరిస్థితులు.

ఆ చరిత్ర అంతా చెప్తూ, నృసింహ పురాణ కావ్య రచనతో ప్రబంధ పరమేశ్వర బిరుదాంకితుడైన ఎఱ్ఱన జీవితం ఆ కాలంలో ఎటువంటి విధానంతో నడిచిందీ అని చెప్పాలని ఈ వచన కావ్యం రాశాను.

- మంథా భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Charitralo Prabandha Parameswarudu