• Chaduvulo Geluddam Randi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చదువులో గెలుద్దాం రండి...

    Chaduvulo Geluddam Randi

    Publisher: S.R. Book Links

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చదువులో గెలిచేందుకు విద్యాసంస్థలు ఏర్పరిచిన ఒకదారిలో, విద్యార్థులు నడిచో పరిగెత్తో తాత్కాలిక విజయం సాధిస్తున్నారు. వారి చదువు ప్రయత్నమంతా తోలుబొమ్మలాటలాగా ఉండిపోతోంది. ఏమి చదవాలో, ఎలా చదవాలో ఎంత సేపు చదవాలో విద్యాసంస్థలే నిర్ణయిస్తున్నాయి.

విద్యార్ధికీ, విద్యార్థికీ ప్రతిభలోనూ మానసిక శక్తులలోనూ, ఆసక్తులలోనూ తేడాలుంటాయని గమనించి ఆ వైవిధ్యానికి తగినట్లు శిక్షణా ప్రణాళిక మార్చుకొనే వెసులుబాటు ప్రస్తుత విద్యావిధానంలో అందుబాటులో లేదు. అందువల్ల చదువు కేవలం మార్కులు, ర్యాంకులు, సర్టిఫికేట్లు సంపాదించే పనిగా మిగిలిపోతోంది. జీవితంలోని గెలుపు రహస్యాలను, గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావాల్సిన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పే లక్షణం నేటి చదువుల్లో అంతరించిపోతోంది.

చదువులో గెలవడం అనే ప్రక్రియను, అవగాహన చేసుకొని, సాధన చేస్తే, అందులో ఉపయోగించిన సూత్రాలు, చిట్కాలు, నైపుణ్యాలు అన్నీ జీవితంలో విజయం సాధించేందుకు కూడా ఉపయోగిస్తాయి. ఇది నిజం. అలాంటి గెలుపు రహస్యాలను మీకు పరిచయం చేయడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. ఈ పుస్తకంలో ముందు ముందు మీరు చదివి అర్థం చేసుకొనే విషయాలన్నీ మీకు జీవితంలో గెలవడానికి కూడా ఉపయోగిస్తాయి. మరెందుకు ఆలస్యం, ముందు పుస్తకాన్ని చదవండి, పుస్తకం ద్వారా మీలో కలిగిన కొత్త అవగాహనతో మీ పాఠ్యపుస్తకాలు చదవండి. చదువుతో పాటు జీవితంలోనూ గెలవండి....

- నండూరి వెంకట సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Chaduvulo Geluddam Randi