• Chaduvula Velugulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 91.8
    102
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చదువుల వెలుగులు

    Chaduvula Velugulu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 175
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన వ్యాసాల సంకలనం.

ఈ పుస్తకంలో పిల్లలలి పాఠాలెలా చెప్పాలి? బడి ఎలా ఉండాలి? ఎలా ఉంటే పిల్లలు సులభంగా నేర్చుకుంటారు? అనే అంశాలపైన చేసిన వివిధ ప్రయోగాలను తెలిపే వ్యాసాలున్నాయి.

* * *

అక్కడి స్కూళ్ళన్నీ మన స్కూళ్ళలాంటివే! బయటనుంచి చూస్తే ఏమీ తేడా ఉండదు. ఎలాంటి విశేషమూ ఉండదు.

కానీ తరగతి గదిలోకి అడుగు పెడితే చాలు మనకు అద్భుతలోకం, పిల్లల ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. గది గోడలన్నీ పై నుంచి కింది దాకా రంగురంగుల బొమ్మలు, పిట్టలూ, జంతువులూ ఒక్కటేమిటి? అదో స్వప్నలోకం.వాటిల్లో అర్థంకాని సూక్తులుండవు. ఏదేదో 'సమాచారం' ఉండదు. పిల్లలకి తెలియంది, అర్థం కానిది, అవసరంలేనిది అక్కడేమీ ఉండదు. తమ చుట్టూ ఉన్న ప్రపంచమే గోడల నిండా ప్రత్యక్షం.

ఒకటో తరగతి పిల్లలు ఆ స్కూళ్ళకు పలకలూ, పుస్తకాలూ తీసుకొని రారు. గోడలకి అన్నివైపులా పిల్లలకి అందే ఎత్తులో నల్లటి పెయింటింగ్‌ వేసేవారు. పిల్లలు అక్కడే రాస్తారు. టీచర్లు పిల్లలతో పాటే కింద కూచుంటారు. పిల్లల్లోనే కలిసిపోతారు. ఈ ఒక్కపనితో పిల్లలూ మాస్టరూ దగ్గరైపోయారు. అక్కడి పిల్లలు కేవలం మాస్టారు చెప్పింది వల్లె వెయ్యరు. పిల్లుల్లా అరుస్తారు. ఏనుగులా నాట్యం చేస్తారు. కుందేలులా గెంతుతారు.

ఊహించని రీతిలో పిల్లల హాజరు పెరిగింది. ఆడపిల్లల సంఖ్య బాగా ఎక్కువైంది. పిల్లలూ టీచర్లూ కలిసి ఆ స్కూళ్ళలో అతి తక్కువ ఖర్చుతో బొమ్మలు వేస్తారు. మాస్క్‌లు చేస్తారు. ఏం చేసినా చుట్టుపక్కల దొరికే వస్తువులతోనే చేస్తారు. వాళ్ళ దృష్టిలో 'కాదేదీ బొమ్మకనర్హం'. ఆ స్కూళ్ళలో కథలు చెప్పని పిల్లలుండరు. పాటలు పాడని మాస్టార్లుండరు. ఆడినా పాడినా పిల్లలూ మాస్టార్లూ కలిసి చెయ్యవల్సిందే.

''పిల్లలకి తమకంటూ ఓ ప్రపంచం ఉంది. తమకంటూ ఓ నేర్చుకొనే విధానం ఉంటుంది. మన క్లాసురూము సైతం అలాగే ఉండలి. అలాగే మనం నేర్పే విధానం ఉండాలి. అప్పుడు పిల్లలు బడిని 'తమది' అనుకొంటారు. పరుగెత్తుకొస్తారు. లేకుంటే నీరసపడతారు. పారిపోయొస్తారు.''

Preview download free pdf of this Telugu book is available at Chaduvula Velugulu