• Bharya Bhartala Anubandham
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భార్యా భర్తల అనుబంధం

    Bharya Bhartala Anubandham

    Publisher: Victory Publishers

    Pages: 55
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భార్యాభర్తలు సుఖమైన సంసార జీవితాన్ని సాగించాలంటే ఒకరినొకరు ప్రేమిస్తూ అభిరుచులకు విలువలనిస్తూ అనురాగంతో ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కొంచెం కష్టం కలిగినా దానిని తనదిగా భావించుట ముఖ్యము. పురుషాధిక్యతను ప్రదర్శింపకుండుట, నిత్యకృత్యములలో తనకు గల పెక్కు సౌలభ్యములు, స్వేచ్ఛ, తన భార్యకి స్త్రీ అగుటవలన ఉండవని తెలుసుకొని పురుషుడు ప్రవర్తించాలి.

పై విషయములతో పాటు అతిముఖ్యమైనది భార్యభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధం - సెక్స్‌. పునరుత్పత్తికి సెక్స్‌ ఎంత ముఖ్యమో భార్యాభర్తల మధ్య చిరాకులు, పంతాలు, మనస్పర్థలు లేక ప్రేమతో, అనురాగంతో, ఆత్మీయతతో, ఆనందంగా జీవనం సాగించుటకు కూడా ఇది అంతే ముఖ్యం.

రోజువారి కుటుంబ సమస్యలు, ఉద్యోగ, వ్యాపార సమస్యల వలన కలిగే మానసిక ఒత్తిడి - సంభోగం వలన మటుమాయమవుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలోను, స్ట్రెస్‌ (ఒత్తిడి, ఆందోళన), ఎక్కువగా ఉండేవారిలోను సంభోగం తరువాత శరీరంలో చురుకుదనం పెరుగుట, మంచి నిద్ర పట్టుట, శరీరం పూర్తిగా రిలాక్స్‌ అవడంలాంటి ఆరోగ్యపరమైన పరిణామాలు ఎన్నో జరుగునని శాస్త్రజ్ఞుల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సెక్స్‌ విజ్ఞానం యొక్క ప్రాముఖ్యాన్ని నేటి శాస్త్రవేత్తలు, ప్రముఖులు, ప్రభుత్వాలు గ్రహించారు. అందుకే పాఠశాలలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ బోధనాంశాలలో ఒకటై ఉండలని అభిలషిస్తున్నారు. కో ఎడ్యుకేషన్‌ గరిపే నేటి బాలబాలికలకు అతి పిన్న వయసు నుండి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంత ముఖ్యమైనది కాకపోయినా, వివాహానికి ముందు ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి సెక్స్‌ విజ్ఞానాన్ని కలిగి యుండుట ముఖ్యమే. లైంగికపరమైన అవయవ నిర్మాణము వాటి పనులు, సెక్స్‌ గురించి ఉండే పెక్కు భయాలు, సందేహాలు నివృత్తి చేసుకొనుట అతి ముఖ్యమైనది.

సెక్స్‌ అవగాహన పెంచుటకు, సుఖవంతమైన ఆనందదాయకమైన సెక్స్‌కి దోహదపడే కొన్ని ఇతర విషయాలను కూడ ఇందులో చేర్చడమైనది. నూతనోత్సాహముతో దంపతులు సుఖప్రదమైన సంసార జీవనమును గడపాలని ఆశిస్తూ...

- పి. వి. రమణారావు

Preview download free pdf of this Telugu book is available at Bharya Bhartala Anubandham