• Bharatiya Rushulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయ ఋషులు

    Bharatiya Rushulu

    Author:

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ వాఙ్మయంలో నిత్యసత్యాలైన ప్రమాణాలు వేదాలు. ఆ వేదాలలో ఉన్న జ్ఞానరాశిని మానవజాతి మనుగడకై అందించిన ఋషులు గురించి తెలుసుకోవాలంటే చరిత్రరూపమైన సాక్ష్యం లేనట్టి పురాతనకాలానికి వెళ్ళాల్సిందే. ఆ ప్రాచీనకాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి భారతీయ ఋషులు చేసిన కృషి శ్లాఘనీయం. వారు అందించిన నిత్యసత్యాలు జాతీయ జీవన విధానాన్ని సరైన దిశలో నడిపించాయి కాబట్టి అంతటి మహిమాఢ్యులైన పూర్వీకులు, ఋషుల సంతతికి చెందినవారమని ప్రతీ భారతీయుడు గర్విస్తాడు. భారతదేశం జన్మించింది రక్తసిక్తమైన కత్తులతో కాదు, ఋషులు ధ్యానంలో దర్శించిన పారమార్థిక సత్యాల ద్వారా. సర్వసంగ పరిత్యాగులు, కౌపీనధారులైన ఋషులు, వారికంటూ ప్రపంచంలో ఏమీ లేనప్పటికీ యావత్ మానవాళి హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు వీరిలో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసినవారూ ఉన్నారు. వీరు మా పూర్వీకులని చెప్పడానికి ఈ జాతి గర్విస్తుంది. ఈ ఋషిపుంగవుల ముందు మార్గదర్శనం కోసం మహాయోధులైన రాజులు మోకరిల్లేవారు.

పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని, వేదస్వరూపంగా చెప్పబడిన రామాయణాన్ని, మహాభారత ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను, ఉపపురాణాలను రచించిన అందించిన వారు ఈ ఋషులే. ఉపనిషత్తులలో వివరించబడిన అవాఙ్మనగోచరమైన ఆత్మ స్వరూపాన్ని ఈ ఋషులు అనుభూతం చేసుకుని ఆచరణయోగ్యంగా తెలియజేశారు. సంసార సాగరాన్ని దాటే ఉపాయాన్ని తత్త్వబోధ రూపంలో గురుశిష్య పరంపరగా అందించారు. భారతీయుల చింతనా ధోరణులు సదా ఆధ్యాత్మికంగా గానే ఉండాలని, వారు ఆత్మవస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని భావి తరాలకు వేదవాఙ్మయ రూపంలో అందించిన యుగకర్తలైన కొంతమంది ఋషుల జీవితాలను సంకలన పరచిన గ్రంథం 'భారతీయ ఋషులు'.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Bharatiya Rushulu