• Bharatiya Adarsa Nareemanulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయ ఆదర్శ నారీమణులు

    Bharatiya Adarsa Nareemanulu

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఎందరో మహిళామణులు అందరికీ వందనాలు' - వేదకాలం నుండి ఇప్పటి వరకు ఎందరో మహిళామణులు ఈ నేలపై జన్మించారు. వైదికసంస్కృతిలో స్త్రీలు వీరవనితలుగానూ, సాధ్వీమణులుగానూ, రాజనీతిజ్ఞులుగానూ రాణించారు. ఆ కాలం నాటి గార్గి, మైత్రేయి వంటి ఎందరో విదుషీమణులు బ్రహ్మాన్ని గురించి చర్చించడంలో వారికున్న బుద్ధిబలం వల్ల ఋషుల స్థానాన్ని అలంకరించారు. రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి వీరవనితలు; ఆండాళ్, అక్క మహాదేవి వంటి సాధ్వీమణులు; మీరా, ముక్తాబాయి లాంటి భక్తి యోగినులు; లీలావతి, ఖానాదేవి మొదలైన మేధావులు; తెలుగునాట వినవచ్చే మొల్ల, వెంగమాంబ వంటి కవయిత్రులు, డొక్కా సీతమ్మ వంటి ఉదారహృదయులు - చరిత్రలో చిరస్థాయిగా ఆదర్శ వనితలుగా నిలిచిపోయారు.

భారతదేశ చరిత్రను, వైదిక సంస్కృతిని పరికిస్తే సనాతన ధర్మాన్ని ఆచరణలో చూపించిన ఘనత మహిళలకే దక్కుతుంది. కాలక్రమంలో సమాజంలో స్త్రీలకు స్వాతంత్ర్యం ఇవ్వడంలో కొంత ప్రాధాన్యత తగ్గడం వల్ల; విద్య నేర్చుకోవడానికి స్త్రీలు అనర్హులు అనే నానుడి ప్రబలడం వలన స్త్రీల స్వేచ్ఛకు కొంత భంగం వాటిల్లింది. స్వామి వివేకానంద 'ఏ దేశమైతే స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉన్నత స్థితిని పొందలేదు' అని అన్నారు. ఈనాడు మహిళాసాధికారత అనే వాదం ప్రబలంగా వినిపించడంతో మహిళలు పురుషులతో సమానంగా సర్వశక్తిమంతులు అవుతున్నారు. అయితే స్వేచ్ఛలో, కృషిలో, శక్తియుక్తులలో ప్రతిభను కనబరచటంతో పాటు, వారసత్వసంపదను పంచడంలోను, మతధర్మాలను ఆచరించడంలోను పూర్వపు నారీమణులను అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే స్త్రీలు గౌరవించబడి దేశం ఉన్నత స్థితిని పొందుతుంది.

ఈ పుస్తకంలో వివిధ రంగాలలో రాణించిన అటువంటి కొందరు నారీమణుల జీవిత విశేషాలను సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది. వారు వివిధ రంగాలలో రాణించినప్పటికీ, ఆధ్యాత్మిక ధర్మాలైన జీవనపు పట్టుకొమ్మలను ఏనాడూ విడువలేదు. ఈనాటి యువతులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని తదనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవాలన్న సదుద్దేశంతో 'భారతీయ ఆదర్శ నారీమణులు' అనే ఈ పుస్తకాన్ని ముద్రించాం. మహిళలు, ముఖ్యంగా యువతులు ఈ పుస్తకాన్ని చదివి ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Bharatiya Adarsa Nareemanulu