• Bharatha Swatantrodyamam Andhra Pradesh Muslimlu
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 270
  300
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు

  Bharatha Swatantrodyamam Andhra Pradesh Muslimlu

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సయ్యద్ నశీర్ అహమ్మద్ 22 డిసెంబరు 1955 నాడు నెల్లూరు జిల్లా పురుణి గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి సయ్యద్ బీబీజాన్, తండ్రి సయ్యద్ మీరా మొహిద్దీన్. ప్రాథమిక విద్య పురుణి గ్రామంలో జరిగింది. ఉన్నత విద్యను కావలి, నరసరావుపేట, భోపాల్, చిత్రదుర్గ, గుంటూరులలో పూర్తిచేశారు.

విద్యార్ధి దశ నుండే సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా పరిశీలనా దృష్టిని, సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన అనేక సాంఘిక, సాహితీ, సేవాసంస్థల బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు. వికలాంగులు ప్రత్యేకించి అంధుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, స్వయం కృషితో వారు అభ్యున్నతికి దిశగా సాగేందుకు సంఘాలు ఏర్పాటు చేయించి ఆయా సంఘాలకు ప్రథాన సలహాదారునిగా చురుకైన మార్గదర్శకత్వం వహిస్తున్నారు. అఖిల భారత చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రంలోని వినియోగదారుల సంఘాల సలహాదారునిగానూ, చిన్న పత్రికల మనుగడ కోసం కృషి చేశారు.

విద్యాభ్యాసం తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. న్యాయవాదిగా పనిచేస్తునే, 'ఉదయం' దినపత్రిక విలేఖరిగా చేరి 10 సంవత్సరాల కాలంలో ఆ పత్రిక విజయవాడ ఎడిషన్ న్యూస్ కో-ఆర్డినేటర్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత కొంత కాలం 'వార్త' దినపత్రిక గుంటూరు న్యూస్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా పనిచేసారు. ఆయన రాసిన పలు వ్యాసాలు, కవితలు, గేయాలు, కథానికలు దాదాపు అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలో చోటుచేసుకున్నాయి. "భారత స్వాతంత్ర్యోద్యమం ముస్లిం మహిళలు", "భారత స్వాతంత్ర్యోద్యమం ముస్లింలు", "భారత స్వాతంత్ర్యోద్యమం ఆంద్రప్రదేశ్ ముస్లింలు", "మైసూర్ పులి టిపూ సుల్తాన్", "షహీద్ - ఏ- ఆజం-అఫ్ఫాఖుల్లా ఖాన్" పుస్తకాలను రాసి ప్రచురించారు.

ప్రస్తుతం "భారత స్వతంత్ర్యోద్యమం: ముస్లిం యోధులు" రచన పూర్తి చేశారు. "భారతీయ ముస్లింలు" అను పరిశోధనాత్మక గ్రంథరచన ప్రధాన లక్ష్యంగా, భారతీయ ముస్లింల సామాజిక - ఆర్ధిక-రాజకీయ స్థితిగతుల మీద విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. చరిత్ర, ఆర్ధిక సామాజిక శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో సభ్యునిగా పలు సభలు, సమావేశాలలో పాల్గొన్నారు. మంచి వక్త. భారతదేశంలోని అన్ని సాంఘిక జనసముదాయాల మధ్య స్నేహం, సామరస్యం, సదవగాహన ఏర్పడాలనీ, సమాజంలో సుహృద్భావ వాతావరణం మరింతగా విలసిల్లాలని ఆకాంక్షించే మానవతావాది. లౌకిక ప్రజాస్వామ్యవాది.

Preview download free pdf of this Telugu book is available at Bharatha Swatantrodyamam Andhra Pradesh Muslimlu