• Bharata Swatantrya Sangramam Muslim Yodhulu Part1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత స్వాతంత్ర్య సంగ్రామం ముస్లిం యోధులు ప్రథమ భాగం

    Bharata Swatantrya Sangramam Muslim Yodhulu Part1

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సయ్యద్ నశీర్ అహమ్మద్ 22 డిసెంబరు 1955 నాడు నెల్లూరు జిల్లా పురుణి గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి సయ్యద్ బీబీజాన్, తండ్రి సయ్యద్ మీరా మొహిద్దీన్. పురుణిలో ప్రాథమిక విద్య తరువాత, కావలి, నరసరావుపేట, భోపాల్, చిత్రదుర్గ, గుంటూరులలో విద్యాభ్యాసం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. నరసరావుపేట 'ఉదయం' దినపత్రిక విలేఖరిగా పనిచేస్తూ, ఆ పత్రిక విజయవాడ ఎడిషన్ న్యూస్ కో-ఆర్డినేటర్ స్థాయికి ఎదిగారు. అనంతరం 'సిటీకేబుల్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్' (విజయవాడ)లో అడ్మినిస్ట్రేటివ్ - న్యాయ వ్యవహారాల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత, 'వార్త' దినపత్రిక గుంటూరు న్యూస్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా పనిచేసారు.

చిన్నతనం నుండే సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా పరిశీలనా దృష్టిని, సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన పలు సాంఘిక, సాహితీ, సేవాసంస్థల కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. అఖిల భారత చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రంలోని వినియోగదారుల సంఘాల సలహాదారునిగానూ, రాష్ట్రంలోని పలు వార, పక్ష, మాస పత్రికల గౌరవ సంపాదకుడిగా సేవలందించారు. అంధులు, వికలాంగులు, కుష్టురోగపీడితుల ఆరోగ్య-అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ వహించి కృషి చేస్తున్నారు.

ఆయన రాసిన వ్యాసాలు, కవితలు, కథానికలు పలు పత్రికలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. భారత ముస్లిం జనసముదాయల సామాజిక - ఆర్ధిక-రాజకీయ స్థితిగతుల మీద విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. చరిత్ర, ఆర్ధిక సామాజిక శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తి మెండు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో సభ్యునిగా పలు సభలు, సమావేశాలలో పాల్గొన్నారు. మంచి వక్త మాత్రమే కాకుండా చిత్రకారుడు, కార్టూనిస్టుగా కూడా ఆయన ప్రసిద్ధుడు.

భారతదేశంలోని అన్ని సాంఘిక జనసముదాయాల మధ్య స్నేహం, సామరస్యం, సదవగాహన ఏర్పడాలనీ, సమాజంలో సుహృద్భావ వాతావరణం మరింతగా విలసిల్లాలని ఆకాంక్షించే మానవతావాది. అన్ని రకాల అసమానతలు తొలగిపోవాలని కాంక్షించే లౌకిక ప్రజాస్వామ్యవాది.


- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharata Swatantrya Sangramam Muslim Yodhulu Part1