• Bharata Swatantrodyamam Muslim Praja Poratalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • భారత స్వాతంత్ర్యోద్యమం ముస్లిం ప్రజా పోరాటాలు (free)

    Bharata Swatantrodyamam Muslim Praja Poratalu - free

    Pages: 173
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ చరిత్రలో అపూర్వం అనదగిన రీతిలో సాగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ రాస్తున్న పుస్తకాలకు పాఠకులు, ప్రజలు, పత్రికల నుండి లభించిన ఆదరణ, ప్రోత్సాహంతో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా, ఈ నేలతల్లి బిడ్డలైన ముస్లింల భాగస్వామ్యంతో సాగిన ప్రధాన ఉద్యమాలను ఈ గ్రంథంలో క్లుప్తంగా వివరించాను.

భరతగడ్డ మీద బ్రిటీషర్లు బలపడుతున్న సమయాన, 1763 ప్రాంతంలో ప్రారంభమై 1947 వరకు సాగిన పలు ప్రజా పోరాటాలలో ముస్లింలు తమదైన పాత్ర వహించారు. ఈ పోరాటాలన్నింటిలో ఖిలాఫత్ ఉద్యమం అగ్రభాగాన నిలచింది. ఈ ఉద్యమం ముస్లిం-ముస్లిమేతర జనసముదాయాల మధ్య ఐక్యతకు, స్నేహానికీ, సామరస్యానికి ప్రతీకగా నిలిచి, విఖ్యాతిగాంచింది. జాతీయోద్యమం ప్రథమార్థంలో ప్రారంభమై, స్వాతంత్ర్య పోరాటానికే తలమానికంగా నిలచిన, ఖిలాఫత్ ఉద్యమం గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించటంలేదు. మరొక ప్రత్యేక గ్రంథం రాస్తే తప్ప, ఆ ఉద్యమ చరిత్రకు సరైన న్యాయం జరగదు.

ప్రస్తుత గ్రంథంలో ఐదు ఉద్యమాల గురించి ప్రస్తావించాను. అవి ఫకీర్ల తిరుగుబాటు, వహాబీల పోరాటం, ఫరాజీల ఉద్యమం, మోప్లాల తిరుగుబాటు, ఖుదా-యే-ఖిద్మత్‌గార్‌ల అహింసా ఉద్యమం. ఈ ప్రతి ఉద్యమం గురించి ఒక ప్రత్యేక పుస్తకం రాయాల్సినంతగా ప్రజల సాహసం, త్యాగం, ఆత్మార్పణలు ఇమిడి ఉన్నాయి. నాకున్న పరిమితుల మేరకు ఆ వివరాలను రేఖా మాత్రంగా పేర్కొన్నాను.

- సయ్యద్ నశీర్ అహమ్మద్