-
-
భల్లూక రాజ్యం
Bhalluka Rajyam
Author: Saltykov-Shchedrin
Publisher: Vasireddy Publications
Pages: 176Language: Telugu
“అహింసావాదులు. మీరు మాంసం తినడం ఏమి మర్యాద స్వామీ?”
“మాంసం!! కల్లుచుక్క పడనిదే మాంసానికి మజా రాదు”
“కల్లు చుక్క కూడా అలవాటైందీ?”
“చుక్కవేసిన తర్వాత చక్కని సాని వుంటే కాని అందం లేదు”
“సరి సరి! సాని కూడానా? ఐతే స్వామీ సానిదానికి ఇవ్వడానికి డబ్బెక్కడిది?”
“దొంగతనం చేస్తాం. జూదమాడి సంపాదిస్తాం”
“దొంగతనంలోనూ, జూదంలోనూ అందెవేసినట్టు కనిపిస్తున్నారే!”
“అన్ని విధాలా భ్రష్టుడైనవాడికి అంతకన్న దారేముంది?”
ఇది భోజరాజుకి, కవి కాళిదాసుకీ జరిగిన సంవాదమని చెబుతారు. ఈ సంవాదం ఒక శ్లోకరూపంలో వుంది. వ్యసనపరుడైన రాజుకు బుద్ది చెప్పడానికి కవి అల్లిన కథ ఇది.
రాజనీతిని ప్రబోధించడానికి ఏ అజ్ఞాత మహాకవో కల్పించిన పంచతంత్రం ప్రపంచ సాహిత్యానికే మకుటాయమానం.
సమాజంలోని ఎగుడు దిగుళ్లను, కలవారి కండకావరాన్ని, లేనివారి దైన్యాన్ని, అధికార దర్పాన్ని సునిశితంగా విమర్శిస్తూ పిట్టకథలు చెప్పిన ఈసఫ్ ప్రపంచ సాహిత్యంలోనే వందనీయుడుగా పేరుగన్నాడు.
వాచ్యంగా చెప్పిన నీతికన్నా వ్యంగ్యంగా చెప్పిన నీతి మనసుకు హత్తుకుంటుంది. సూటిగా చెప్పిన మాటకన్నా వ్యాజోక్తి సూటిగా తగులుతుంది. ప్రత్యక్షోపదేశంకన్నా అన్యాపదేశం చక్కగా పనిచేస్తుంది.
అందుకనే పంచతంత్రానికీ, ఈసఫ్ కథలకు అంత ప్రపంచ ప్రఖ్యాతి, అంత గౌరవం.
సాల్టికోవ్ షెడ్రిన్ ఈ అన్యాపదేశంలో, వ్యాజోక్తిలో, వ్యంగ్య రచనలో సిద్ధహస్తుడు.
ఇప్పటికి సుమారు 150 సంవత్సరాల క్రితం రష్యాలోని ధనవంతుల దర్పాన్ని, పేదల దైన్యాన్ని, రైతుల హీనస్థితినీ వివరిస్తూ మన పంచతంత్ర ఫక్కీలో రాసిన కథలు ఇవి. గతంలో 'గొప్పవారి గోత్రాలు' పేరిట తెలుగులో వచ్చాయి. ఒకటిన్నర శతాబ్దం దాటినా.. భారతీయ వర్తమాన పరిస్థితికి అతికినట్టు సరిపోతున్న ఈ కథలను 'భల్లూక రాజ్యం' పేరిట తాజాగా ప్రచురిస్తున్నాం.
- వాసిరెడ్డి పబ్లికేషన్స్
గమనిక: " భల్లూక రాజ్యం " ఈబుక్ సైజు 40mb