• Bhakta Meera
  • Ebook Hide Help
    ₹ 33
    33
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భక్త మీరా

    Bhakta Meera

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బని కలం నుండి “ భక్త మీరా కవితలు” అనువాద పుస్తకం

భక్తీ ప్రపత్తులకు నిలయమైన భారతదేశములో భక్త కవులకు, భక్తీ తత్వానికి కొదువ లేదు. భక్త కవుల సాహిత్యం మానవ జీవనములో భాగమై ప్రజా జీవితాన్ని సుసంపన్నం చేసింది. అలాంటి భక్త కవులలో కబీర్, సూర్ దాస్, తులసి దాస్, భక్త జయదేవుడు, భక్త తుకారామ్, రామదాసు, అన్నమయ్య, త్యాగయ్యలా పేరు గాంచిన వారిలో మీరా బాయి ఒకరు. ఆమె కృష్ణ భక్తీ తత్త్వానికి, ప్రేమ తత్త్వానికి నిజమైన ప్రతీక. మనసంతా కృష్ణునిపై నిలిపి భక్తి పారవశ్యంలో పొంగిపోయి విశేషమైన సాహిత్యాన్ని అందించింది మీరా బాయి.
చరిత్రలో ఎందరో రాజుల, రాణుల గాథలు మనకు వినిపిస్తుంటాయి. ఎందరో చరిత్రలు అంతరించిపోయి ఉంటాయి. కాని చిత్తోడ్ గడ్ రాణివాసపు మహిళ మీరా బాయి చరిత్రలొ శాశ్వతంగా నిలిచి ఉంది. దానికి కారణం, కృష్ణ భక్తి తత్త్వ కవిత్వానికి ప్రతీక అయి, కృష్ణునిపై అమితమైన ప్రేమతో, బక్తితో కవితలు రాసి, భజనలు గానం చేసిన అద్భుత ప్రేమ పిపాసి మీరా.
మీరా చెప్పినట్లు,
“ ప్రేమ మొక్కను పెట్టి
దినదినం కన్నీళ్లు పోసి పెంచాను
అది మహా వృక్షం అయ్యింది.” అన్నట్లు ప్రేమ తత్త్వానికి, భక్తి తత్త్వానికి ప్రతీక మీరా.
మీరా జీవిత కథను సంక్షిప్తంగా అందిస్తూ, మీరా కవితలను సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా అనువదించారు సబ్బని లక్ష్మీనారాయణ.

Preview download free pdf of this Telugu book is available at Bhakta Meera