• Bhagavadramanujacharya Revised
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగవద్రామానుజాచార్య - రివైజ్డ్

    Bhagavadramanujacharya Revised

    Publisher: Shri Veda Bharathi

    Pages: 54
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

శ్రీ ఆదిశంకరుల అద్వైతం, శ్రీ రామానుజుల విశిష్టాద్వైతం, శ్రీ మధ్వుల ద్వైతం ప్రసిద్ధమైన సిద్ధాంతాలు. ఈ మూడు సిద్ధాంతాలకు అనుయాయులు గణనీయంగానే ఉన్నారు. అయితే ఈ అనుయాయులలో చాలా మందికి 'నేనీ సిద్ధాంతానికి చెందిన వాడను' అని తెలుసునే తప్ప, తమ తమ సిద్ధాంతాలలోని మౌలికాంశాలు గాని, తమ సిద్ధాంతం ఇతర సిద్ధాంతాలలోని ఏయే విషయాలతో ఏకీభవిస్తుంది, లేక విభేదిస్తుంది అనే విషయాల మీద గాని అవగాహన లేదు. ఇది యాంత్రిక జీవితం వల్ల, తెలుకోవాలనే ఆకాంక్ష లేక పోవడం వల్ల, ఈ సిద్ధాంతాల మీద గ్రంథాలు జటిలంగా ఉండడం వల్ల సంభవించింది. సిద్ధాంతకర్తల జీవిత విశేషాలు కూడా చాలా మందికి తెలియవు. ఇది సామాన్యుల పరిస్థితి. జిజ్ఞాసతో అధ్యయనం చేసే వారికి, పండితులకు చెప్పవలసిందేమీ లేదు.

అలాంటి సామాన్యులకు, ముఖ్యంగా జిజ్ఞాస ఉన్నా విపులమైన, జటిలమైన గ్రంథాలను అధ్యయనం చేయడానికి సమయం లేనివారికి, వారి వారి సిద్ధాంతాల మీద కనీస అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో శ్రీవేదభారతి 'శ్రీ ఆదిశంకరాచార్య', 'భగవద్రామానుజాచార్య', 'శ్రీ మధ్వాచార్య' అనే మూడు చిన్ని పుస్తకాలను ప్రచురించింది. సంక్షిప్తంగా ఆయా సిద్ధాంత కర్తల జీవిత విశేషాలను, సిద్ధాంతాలను కేవలం పరిచయం చేయడమే ఈ చిన్ని పుసక్తాల ధ్యేయం. వీటని చదివిన తరువాత ఆయా సిద్ధాంతానికి చెందిన వారు ప్రభావితులై వారి వారి ఆచార్యుల జీవిత చరిత్రలను, సిద్ధాంతాలను సమగ్రంగా అధ్యయనం చేస్తారని ఆకాంక్ష.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Bhagavadramanujacharya Revised