• Best Children Better Parents
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బెస్ట్ చిల్డ్రెన్ బెటర్ పేరెంట్స్

    Best Children Better Parents

    Author:

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కనడమే తమ బాధ్యత అనుకుంటారు. ఇంకొంతమంది ఇంట్లో పెద్దలు వారి విషయాలను చూసుకుంటారులే అని అసలు పిల్లల పట్ల శ్రద్ధ వహించరు. ఇలా పిల్లల్ని అశ్రద్ధ చేసుకుంటూ పోతే వారిలో మానసిక వికాసం ఏర్పడదు. అందుకే పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు గైడెన్స్, కౌన్సిలింగ్ ఆవశ్యకత ఉంది.

పిల్లల్ని కనడం దగ్గర నుండి వారి ఆరోగ్యం, విద్యా, మానసిక వికాసం, సామాజిక విషయాలలో, నైతిక విలువలు, శాస్త్రీయ దృష్టిని పెంపొందించడంలో ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాలయాలు తమ బాధ్యతను గుర్తించాలి.

తల్లిదండ్రులు విద్యావంతులయితే వారి పిల్లలను కూడా విద్యావంతులుగా తయారుచేయడానికి కృషి చేస్తారు. కనుక ముందుగా తల్లిదండ్రులు సుశిక్షితులై ఉండాలి.

క్రమశిక్షణ చిన్ననాటి నుండి పిల్లలలో అలవర్చాలి. అలా లేనట్లయితే పిల్లలలో ప్రవర్తనా సమస్యలు, దొంగతనాలు, బాధ్యతారాహిత్యం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే ముందు వారు క్రమశిక్షణ, బాధ్యత కల్గినవారై ఉండాలి. అప్పుడే పిల్లలు వాటిని అనుకరిస్తారు.

అలాగే పిల్లలలో జాతీయ దృక్పథాన్ని అలవరచాలి. వారిలో మూఢ విశ్వాసాలకు తావు కల్పించకూడదు, మూఢవిశ్వాసం వ్యక్తిని పెడదారి పట్టిస్తుంది. వారిలో శాస్త్రీయ ధృక్పథం కల్గించాలి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మొదట నుండి పిల్లలలో కల్గించాలి. వారిని అభినందించాలి. పిల్లలలో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందించాలి. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎక్కువగా సహకరించాలి.

పిల్లలలో ఒక్క చదువు అనే భావననే ప్రోత్సహించకూడదు. అన్నీ కోణాలలో మానసిక, శారీరక అభివృద్ధి జరగాలి. ఇతరులతో సర్దుకుపోయే మనస్తత్వం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని తమకున్న తెలివితేటలు, స్మిల్స్, నాలెడ్జ్‌ని సద్వినియోగం చేసుకుని జీవితంలో విజయం సాధించే వ్యక్తులుగా సామాజిక స్పృహ కల్గిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.

- డా. యమ్.వి.ఆర్. రాజు

Preview download free pdf of this Telugu book is available at Best Children Better Parents