• Batukamma Paatalu Telangana Jagruti - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • బతుకమ్మ పాటలు - తెలంగాణ జాగృతి (free)

    Batukamma Paatalu Telangana Jagruti - free

    Pages: 56
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైనది. భగవంతున్ని పూలతో పూజించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారం అయితే ఆ పూలనే భగవంతునిగా పూజించడం తెలంగాణ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను చాటేదే మన బతుకమ్మ పండుగ. ఆ విశిష్ట సంస్కృతిని తరతరాలుగా బతికిస్తూ వస్తున్నది మన ఆడబిడ్డలే. బతుకమ్మ పండుగ అంటేనే పూలు, పాటలు, పడతులు.
బతుకమ్మ పాటలన్నీ అజ్ఞాత మహిళలచే ఆశువుగా అల్లబడినది. రాగయుక్తమైన శైలి, సరళమైన భాషతో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలివి. బతుకమ్మ పాటల్లోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, ఇతిహాస, చారిత్రక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటల ప్రధాన వస్తువులు. బతుకమ్మ పాటల్లో అమూల్యమైన చరిత్రకు గల మౌఖిక ఆధారాలతో పాటు అద్భుతమైన వ్యంగ్యం, కరిగించే ఆర్ద్రం అడుగడుగునా కనిపిస్తాయి. ఈ పాటలను సేకరించడం మార్పులకు తావులేకుండా వాటిని జానపదులకే సొంతమైన సహజశైలిలోనే భద్రపరచడం ఇప్పటి అవసరం. వాటిని అక్షరబద్దం చేసి పాడుకోవడానికి ఉపయుక్తంగా ఉండేట్టు ఇప్పుడు పుస్తకరూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం.

- కల్వకుంట్ల కవిత