• Bala Nata Sikshana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాల నట శిక్షణ

    Bala Nata Sikshana

    Publisher: Natali Prachuranalu

    Pages: 69
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"బాల నట శిక్షణ" శీర్షికతో శ్రీ కొత్తపల్లి బంగార రాజు గారు ఒక పుస్తకం వ్రాయటం నిజంగా అభినందించవలసిన విషయంగా భావిస్తాను. కారణం, తెలుగు నాటక రంగానికి సంబంధించినంత వరకు పుస్తకాల అభావం ఎక్కువ - ఉన్నవైనా పెద్దలకు సంబంధించినవే తప్ప బాలల కోసం ప్రత్యేకమైన పుస్తకాలు లేవనే చెప్పాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీ బంగార రాజు గారి ఈ ప్రయత్నం చాల గొప్పదైన, అరుదైన, అమూల్యమైన విషయంగా నేను భావిస్తున్నాను.

పుస్తకం అనగానే మన అలవాటు ప్రకారం, గ్రాంథిక భాషలో సాధారణ బాలలకు అర్థంకాని సంస్కృత పదాలలో కాకుండా, బొమ్మలతో పిల్లలను ఆకట్టుకునే శైలిలో బంగార రాజు గారు పుస్తకం ప్రచురించారు. వ్యాస రూపంలో కాకుండా, పదాల రూపంలో అడుగులు వేసిన విభజన (పాఠాలుగా) బాగుంది. తప్పటడుగుల స్థాయి నుంచి, తర్ఫీదు పొందిన స్థాయికి ఎదిగే సోపానాకృతిగా ఈ రచన సాగింది.

- తాళ్ళూరి శివరామకృష్ణారావు, రచయిత, దర్శకులు