• Bahula Panchami Jyotsna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బహుళ పంచమి జ్యోత్స్న

    Bahula Panchami Jyotsna

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

’బహుళ పంచమి జ్యోత్స్న’ రాసి తేలిగ్గా 45 సంవత్సరాలకిందటి మాటే. సరిగ్గా తేదీ గుర్తులేదు. ఆంధ్రప్రభ నుంచి రేడియోకి వచ్చిన రోజులనుకుంటాను. నేను రాసిన నవలల్లో నా మనసుకి దగ్గరగా ఉన్న రచన ఇదే. కారణం - ఇందులో ప్రధాన పాత్రకి స్ఫూర్తి మా నాన్నగారు. ఆలాగే మా అమ్మ. మా నాయనమ్మనీ నాకు గుర్తుంది. ఆ రోజుల్లో నా అనుభవంలోకి వచ్చిన విషయాలన్నీ బహుశా ఈ ఇతివృత్తానికి దోహదమయ్యాయి. మా నాన్నగారు నా రచనల గురించి విన్నారు. కొన్ని నాటికలు చూశారేమో. నాతో నా మొదటి సినిమా చూశారు. ఆయితే నాకు తెలిసి - ఈ నవలని చదివారనుకుంటాను. ఆయన స్పందన ఏమిటి? నేను అడగలేదు అడిగే సాహసం చెయ్యలేదు. నాలో రచయిత - ఆనాటికి ఇంకా వ్యర్థమైన వ్యావృత్తికి లోనయినట్టుగా భావించే రోజులవి. కారణం – రచన, నటన, ప్రసంగం, ఏంకరింగు వంటి ప్రక్రియలు వృత్తులు కాగలిగిన రోజులుకావు. ఆలాగే ఈ నవల ఏ పత్రికలోనూ సీరియల్‌గానూ రాలేదు. ఆ విధంగా ‘బహుళ పంచమి జోత్స్న’ ఎక్కువ ప్రచారానికి నోచుకోని నా ముద్దుబిడ్డ. కథలో ఓ చక్కని ప్రణాళికని ఏర్పరుచుకున్న గుర్తుంది. నా జీవితకాలంలోనే మాధ్యమాలు విశ్వరూపం దాల్చిన నేపధ్యంలో తను రాసిన నవలని గురించి ఒక రచయిత - ఇలా దూరంగా నిలబడి పర్యావలోచన చేయడం వింతగా ఉండవచ్చు.
కొత్తగా పాఠకులు నవలను చదివి ఆభిమానిస్తే - తప్పిపోయిన బిడ్డ దొరికిన తృప్తి కలుగుతుందేమో! కిరణ్‌ప్రభ దంపతులు నా అభిమానులు. వారు ఈ నవలను మెచ్చుకోవడం - పెరటి చెట్టు పువ్వుని తలలో తురుముకోవడం లాంటిది.
దాదాపు ఆర్థ శతాబ్ధం కిందటి రచన ఈ తరం మీద ఎలాంటి స్పందనని కలిగిస్తుంది? నాకూ ఆసక్తిగానే ఉంది. మీ ఉత్సుకతను రెచ్చగొట్టడానికే ఈ రెండుమాటలూ.

- గొల్లపూడి మారుతీరావు

45 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ నవల కొద్దికాలం క్రితం కౌముది అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు కినిగెలో ఈ-బుక్‌గా తీసుకురావడానికి సహకరించిన కౌముది సంపాదకులకు కృతజ్ఞతలు.

Preview download free pdf of this Telugu book is available at Bahula Panchami Jyotsna