• Avva
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవ్వ ( స్మృతి కవిత )

    Avva

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గుండె గుడిలో దేవతా రూపం - సబ్బని ఆత్మీయతా గ్రంధం: అవ్వ (స్మృతి కవిత )

పిడికిలి బిగించిన పసితనం, పట్టు నిలవలేని పెద్దరికం రెండూ జీవితానికి అపురూప దృశ్యాలే. ఎన్నో ఆవేదనలున్నా క్షణంలో తుడిచి పారేసే దశగా పసితనం, సరిదిద్దే దిశగా పెద్దరికం, వృద్దాప్యం. కాలం ఎంతగా నాగరికతను జరీ అంచులా కట్టుకు తిరుగుతున్నా ఆ జరీ ఎప్పటికైనా రాలిపోవడం తప్పదు, తాత్కాలికమయిన జరీ నగిషీని శరీరానికి అంటిపెట్టుకుని, శాశ్వతమయిన ఆత్మను మరచిపోతున్న ఈ రోజుల్లో తన అవ్వకు అక్షరాల గుడిని కట్టించిన ఈ సుకవి సబ్బని లక్ష్మీనారాయణ గారు ధన్యులు.

తెలుగు భాష ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది రాయలసీమ లో 'అవ్వ' అని అమ్మమ్మని లేదా నాన్నమ్మని అంటారు. కాని అదే తెలంగాణలో అమ్మ(కన్న తల్లి)ని 'అవ్వ' అంటారు. అలా ఆలోచిస్తే ఈ నాగవ్వ ఈ కవిని కన్న తల్లి.

ప్రతి మనిషికి ఎదుటి మనిషిపై ప్రేమ అవసరం. ప్రేమ అంటే నేడున్న నీచమయిన సమాజంలో ఒకటే అర్థం కనిపిస్తోంది. అసలు ప్రేమ అనే పదం కన్నప్రేమ నుండి మొదలయింది. అలా మొదలైన ప్రేమ కవి సబ్బని గారికి మొదటి స్థానంలోనే నిలిచిపోవడం హృద్యమయిన దృశ్యం. అంతులేని భావ సౌందర్యం. ఆత్మీయులు శారీరకంగా మనల్ని విడిచి దూరమయిపోయిన సందర్భంలో కలిగే బాధ మనసుని కదిలిస్తుంటే ఆయా సంబంధిత బంధాలు జీవచ్చవాలుగా మారుతారు.

ఈ కవి తన జీవితామంతా అమ్మనే తలుచుకుంటుంటే మనసున్న ప్రతి కన్నతల్లి హృదయం స్పందిoచక మానదు. ఆశీర్వదించక మానదు. మనిషి బతికి ఉంటే నేలపైనే ఉంటాడు. అదే చనిపోతే గుండెలో చేరిపోతాడు. అలాగే సబ్బని గారి "అవ్వ" ఎక్కడికి పోలేదు. కన్నబిడ్డ గుండెల్లో దేవతలా కొలువై ఉంది. ఆమెకు మరణం లేదు. కన్నతల్లిని అక్షరాలతో గుడి కట్టి గొంతెండి పోయిన సమాజానికి ఆత్మీయత, అనురాగం పదాలకు మరోమారు అర్థాలు తెలియజేసిన సబ్బని లక్ష్మీనారాయణ గారి జన్మ సార్థకమయింది అనడంలో సందేహం లేదు.

- శైలజా మిత్ర

Preview download free pdf of this Telugu book is available at Avva