• Avakaya Padyalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆవకాయ పద్యాలు (free)

    Avakaya Padyalu - free

    Pages: 79
    Language: Telugu
    Rating
    4.14 Star Rating: Recommended
    4.14 Star Rating: Recommended
    4.14 Star Rating: Recommended
    4.14 Star Rating: Recommended
    4.14 Star Rating: Recommended
    '4.14/5' From 7 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఆవకాయ మన అందరిదీ” అంటే మీరేమంటారు? కాదంటారా?? వేసవి కాలం వస్తుందనగానే ఆవకాయ తయారీ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. నడివేసవిలో తెలుగువారినెవరిని పలకరించినా ఆవకాయ మాట రాకుండా ఉండదు. ఫేస్‌బుక్ లో చాలా ఉత్సాహంగా సాగుతున్న "ఛందస్సు" కూటమి సభ్యులచేత మన ఆవకాయ అంశంగా ఇరవై నాలుగు గంటల్లో శతకం రాయించాలన్న ఆలోచన వచ్చింది. ఇది అసాధ్యమేమీ కాదని నా నమ్మకంగా ఉండింది.. అది వమ్ము కాలేదు. మే నెల ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు కూటమిలో ఇచ్చిన “ఆవకాయ” అంశం మీద సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వంద పద్యాలు రాయమంటే అవి సాయంత్రానికే పూర్తి చేసేసారు. మరునాడు ఉదయం కేటాయించిన సమయం ముగిసేసరికి అవి 185 అయ్యాయి. పద్యాలను ప్రచురించగానే కూటమిలోని మిగతా సభ్యులు అందులోని తప్పులను ఎత్తి చూపి రచయితల చేత సరిచేయించారు. ఈ సవరణ కార్యక్రమాన్ని ముఖ్యంగా శ్రీమతి సుప్రభ, సర్వశ్రీ మోహనరావు, రవిప్రసాద్, గణపతి, నరసింహమూర్తి, గోపాలకృష్ణరావు, గిరి, శ్యామ్, సుబ్బారావు, చంద్రమౌళి గారలు, ఇంకా ఇతరులు కొనసాగించారు. తర్వాత ప్రచురణకు ముందు శ్రీ జె.కె.మోహనరావుగారు పద్యాలన్నింటినీ మరోమారు పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించారు.

ఈ శతక రచయితలలో ఎక్కువమంది ఔత్సాహికులు. కొందరు ఇప్పుడిప్పుడే పద్యాలు వ్రాయడము నేర్చుకొంటున్నారు. మరికొందరు ఎంతో ఉత్సాహంగా మొదటిసారిగా పద్యాలు రాసారు. కాబట్టి కవుల శైలిలో భేదములను గమనించవచ్చు. కొందరు వ్యావహరిక భాషలో వ్రాస్తే, మరి కొందరు వ్యాకరణ బద్ధముగా వ్రాసారు తమ కవితలను. ఒక మారు ఈ పద్యములన్నియు చదువబడినను, ఇంకను ఇందులో దోషములు ఉన్నాయనే విషయము నిర్వివాదాంశము. పాఠకులు దీనిని దృష్టిలో నుంచుకొని చదువవలయునని మనవి చేస్తున్నాము.

తెలుగు పద్యరచనలో ఆసక్తి లేని ఈ కాలములో, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని తలపెట్టిన ఇలాటి కొత్త ప్రయోగం (ప్రయత్నము) మా దృష్టిలో ముదావహమైనదని, విజయవంతమైనదని భావిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి మరిన్నిప్రయత్నములను పాఠకులు మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశిస్తున్నాము.

- జ్యోతి వలబోజు