• Atmayogi Satya Katha 1
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మయోగి సత్య కథ - 1

    Atmayogi Satya Katha 1

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 264
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇది శ్రీశార్వరి ఆత్మకథం ... తొలి అధ్యాయాలలో భౌతిక జీవన సంఘర్షణ కనిపిస్తే మలి అధ్యాయాలలో యోగజీవన పరిణామం కనిపిస్తుంది. ఈరెండింటి వారధిగా వారి సాహిత్యజీవనం కొన్నిపుటల్లో పరచుకుంటుంది. రచయితగా, పత్రికారచయితగా కత్తిమీద సాములా విధి నిర్వహణ సాగించిన శ్రీశార్వరి సత్యనిష్ఠ ముందుతరాలకు ఓ పఠనాంశం అనే చెప్పుకోవాలి. మొన్నమొన్నటివరకు తెలుగు దిన, వార పత్రికలకు వున్నంత చరిత్ర పత్రికారచయితగా శ్రీశార్వరికీ వుంది. ఇప్పటిలా పాఠకులు సీరియల్స్‌ వెంట పకుండ అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రిక చేతికి వచ్చిన వెంటనే శ్రీశార్వరి నిర్వహిస్తూ వచ్చిన 'వింతలూ విడ్డూరాలూ', శ్రీ విద్వాన్‌ విశ్వం 'మాణిక్యవీణ'లు చదివితే తప్ప తక్కిన శీర్షికలు, సీరియల్స్‌ వైపు దృష్టి మరల్చేవారు కాదు. ఈనాటికీ శ్రీశార్వరి అంటే వింతలూ విడ్డూరాలను గుర్తుతెచ్చుకునే నాటి పాఠకులు ఎంతమందో!

గత నాలుగు దశాబ్దాలకాలంగా శ్రీశార్వరి దంపతుల జీవితం యోగాశ్రమమే. ఆ యోగాశ్రమంలో వారి అడుగుల చప్పుడు కొన్ని వేలమందికి హృదయలయ ... అదే శ్రీశార్వరి యోగలయ ... ఈ 'ఆత్మయోగి సత్యకథ'కి యోగాలయం. శ్రీశార్వరి దంపతుల అష్టపదులే ఈ యోగాలయ స్వాగతస్వరాలు. యోగాసక్తి వున్నవారికి అవి ప్రవేశద్వారాలు ... లోపలికి అడుగుపెట్టాలే కాని వెన్నెలసోన ఆ మందిరాన పరచుకుని మాస్టర్‌ యోగ దర్శనంతో జీవితాన్ని జాగృతపరుస్తుంది ... చైతన్య విలసితమైన శక్తిపాతం ఆపాతమధురమవుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Atmayogi Satya Katha 1