• Asale Koti Chinnari Chitti Kathalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అసలే కోతి... - చిన్నారి చిట్టి కథలు

    Asale Koti Chinnari Chitti Kathalu

    Publisher: Shaili Publications

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలంటే ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. ఐదేళ్ళలోపు పిల్లలకి కథలు వినడం అంటే ఎక్కడ లేని ఆసక్తి వుంటుంది! పెద్దలు ఆసక్తిని కొనసాగించగలిగితే మూడో తరగతి నుంచే చిన్నచిన్న కథలను చదవడం వాళ్ళకి అలవాటు అవుతుంది! కథలు చదివే అలవాటు వున్నపిల్లలకు పాఠాలు ఆకళింపు చేసుకోవడం అవలీలగా ఒంటపడుతుంది. అందుకే పిల్లల్లో పఠనాశక్తి పెంచడం ప్రతి తల్లి, తండ్రి, గురువు కర్తవ్యం! అందుకే పిల్లలు కథలు చదివే అలవాటు పెంపొందించుకునేలా పెద్దలు వాళ్ళను ప్రోత్సహించాలి!

అయితే దురదృష్టవశాత్తు "ఈ కంప్యూటర్ యుగంలో అసలు తల్లిదండ్రులు పిల్లల కథల పుస్తకాలు కొంటున్నారా? పిల్లల్ని తెలుగు చదివేలా ప్రోత్సహిస్తున్నారా?" అని ప్రశ్నించుకుంటే చాలా వరకూ లేదనే సమాధానం వస్తుంది. ముందు పెద్దలు మారాలి! పిల్లలకి సరైన మార్గదర్శకం చేయాలి! మాతృభాష మీద పట్టు సాధించిన పిల్లలకు ఇతర భాషలు సులువుగా ఒంటపడతాయి!

అందుకు తనవంతు సహకారంగా శ్రీ కూచిమంచి నాగేంద్రగారు ఈ "అసలే కోతి - చిన్నారి చిట్టి కథలు" కథల పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో పిల్లల్ని, పెద్దల్ని కూడా అలరించే కథలున్నాయి! అమ్మ మాట పెడచెవిన పెట్టి కష్టాలు తెచ్చుకున్న చిరుకప్ప కథ, తన నేస్తాలయిన కుందేళ్ళను నక్కల బారిన పడకుండా కాపాడిన మంచి నేస్తం కాకి కథ, మద్యం మత్తులో తమకి తామే అపకారం చేసుకుంటారని చెప్పే కోతి కథ, సమయస్ఫూర్తికి వయసుతో పని లేదని చెప్పే చిట్టి కుందేలు కథ, స్నేహితులను సంపాదించుకోవడంలోని లాభాన్ని చెప్పే కోయిల - కాకి కథ... ఇలా ఎన్నో మంచి కథలు పిల్లలకి జంతువుల ద్వారా మంచీ-చెడు చెప్పించిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి.

- మాచిరాజు కామేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Asale Koti Chinnari Chitti Kathalu