• Ariel Shelley Swapna Vishadam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 267.84
    297.6
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏరియల్ - షెల్లీ స్వప్న విషాదం

    Ariel Shelley Swapna Vishadam

    Author:

    Publisher: A. K. Publications

    Pages: 278
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సర్ బీష్ షెల్లీ మనుమడు... న్యూ షోర్ హామ్ పార్లమెంటు సభ్యుడైన తిమోతి షెల్లీ పెద్ద కుమారుడు... ససెక్స్ ఫీల్డ్ ప్లేస్ సంస్థానానికి, రెండు లక్షల విలువగల నిధి నిక్షేప క్షేత్రాలతోపాటు పార్లమెంటు సభ్యత్వానికి, సాలీనా ఆరువేల పౌండ్ల గౌరవ భృతికి, సర్ బిరుదుకు అర్హుడు, అయినా ఇవన్నీ కాదనుకొని కాలదన్నినవాడు...

కాంతులీనే కనులు, నల్లని ఉంగరాల జుట్టు, గులాబి రంగు ఒంటి ఛాయ, చిప్పిల్లే చైతన్యం, ప్రతి నియమాన్ని ప్రశ్నించే ధీరత్వం కలవాడు...

పుస్తకాలంటే ప్రేమ, మనిషి దుఃఖాన్ని గురించి ఆలోచన, దేవుడు, మతం లాంటి పిచ్చి నమ్మకాలంటే అసహ్యం, సాంఘిక దురాచారాల పట్ల తిరుగుబాటు, అందమంటే ఆరాధన, ప్రకృతిపట్ల ప్రేమ కలవాడు... వివాహ వ్యవస్థను నిరాసించినవాడు...

దయ, కరుణ, వేదనామయ హృదయంతో విశ్వాంతరళం రంగస్థలిగా కవితాఘరి వెలువరించినవాడు...

'స్పిరిట్ ఆఫ్ సాలిట్యూడ్', 'రివోల్ట్ ఆఫ్ ఇస్లాం', 'ప్రామితియన్ అన్‌బౌండ్', 'మాస్క్ ఆఫ్ అనార్కీ', 'ఓవిడ్', 'ది మూన్', 'క్వీన్ మాబ్', 'ది యసాసిన్స్' తో బాటు గ్రీకు నుంచి హోమర్, వర్జిల్ రచనలను అనువదించినవాడు...

అహింస, సహాయ నిరాకరణలతో రాచరికం - నిరంకుశత్వం నుంచి మానవాళిని రక్షించవచ్చని గాంధీజీకి స్ఫూర్తినిచ్చినవాడు...

ఎన్నో రచనలను తన పధ్నాలగవ ఏట నుంచి ప్రచురించినవాడు... ఎన్నో పోరాటాలు, సాహసాలు ఊపిరిగా, ఆచరణను సిద్ధాంతానికి ముందు పెట్టి మనసా వాచా కర్మణా తన నమ్మకాలను నడిపించి, ఇప్పటికి రెండు శతాబ్దాల క్రితం తనకు మూడుపదులు కూడా నిండక మునుపే మరణదేవత ఆహ్వానాన్ని మన్నించాలని ఎటో కనుమరుగైన గంధర్వుడు, ఇప్పుడు మిమ్మల్ని పలకరించడానికి మళ్ళీ ప్రాణం పోసుకుని వస్తున్నాడు....

Preview download free pdf of this Telugu book is available at Ariel Shelley Swapna Vishadam