• Aravinda Savitri
  • Ebook Hide Help
    ₹ 450
    500
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరవింద సావిత్రి

    Aravinda Savitri

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 1040
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''అరవింద సావిత్రి అనుసృజన. ఆంధ్ర మహాసావిత్రి పునఃసృష్టి. ఆంధ్ర మహాసావిత్రిని అందరికోసం రాయలేదు. యోగజిజ్ఞాస కలవారి కోసం, యోగార్హత కలవారి కోసమే రాశాను. వారిని నా సావిత్రి ఏ ఆధ్యాత్మిక యోగ భూమికలకు చేర్చాలో చేర్చి తీరుతుంది. సావిత్రి అర్థం కావాలంటే యోగజిజ్ఞాస, సత్యాన్వేషణ బుద్ధి ఉండాలి. పరాన్ని అన్వేషించాలన్న తపన కావాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి ఏర్పడాలి. అంతకు మించి సత్యాన్ని తపనగా, తపస్సుగా మార్చి ఏదో ఒక యోగ మార్గంలో సాధన చేస్తున్నవారై ఉండాలి. ఏ యోగమార్గంలో యోగసాధన చేస్తున్న వారికైనా 'ఆంధ్ర మహాసావిత్రి' కొత్త వాకిళ్లు తెరుస్తుంది. మంచి ఆలోచనలు తమలోకి ప్రవేశించాలంటే ఎలాంటి అవరోధాలు, అనుమానాలు ఉండకూడదు. ఓపెన్‌ మైండ్‌తో ఆంధ్ర మహాసావిత్రిని చదవాలి, అధ్యయనం చేయాలి. నిత్యం పారాయణ చేయాలి. ప్రతిరోజు కొన్ని పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్లు మూసుకుని అంతర్ముఖులు కావాలి. ఆత్మావలోకనం చేసుకోవాలి. అంటే ఒక తపస్సుగా అధ్యయనం చేయాలి.''

- శార్వరి

ఇది వినిర్మితి .... అంటే విశిష్టమైన నవసృష్టి, తెలుగులో తిక్కనగారు చేసినంత పని. నిజానికి శ్రీ అరవిందులను అర్థం చేసుకోవడమనేది అసలు లేదు. వారిని అనుభూతికి తెచ్చుకోవలసిందే. వారు భాషకు లొంగరు, మేధకు లొంగరు, భావనకు లొంగరు. వారిని అనుభూతికి తెచ్చుకోగల సహృదయత, అలవిమాలిన కవితాత్మగల యోగికి మాత్రమే సహజం. శార్వరి యోగి, కవి. అతడికి నూరేళ్లు. అతడి తెనుగుసేతకు సావిత్రి బ్రతికినన్నేళ్లు.

- భుజంగరాయశర్మ

మూలంతో అనువాదకుడు పొందే తాదాత్మ్యం నుంచి పుట్టే అనువాదం అనువాదం కాదు ... మూలానికి పునర్జన్మ. ఆ విధంగా అరవిందుడి సావిత్రి శార్వరి సావిత్రి అయింది.

- గుంటూరు శేషేంద్రశర్మ

Preview download free pdf of this Telugu book is available at Aravinda Savitri