-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (free)
Arava Prapancha Telugu Sahiti Sadassu - free
Publisher: Vanguri Foundation of America
Pages: 144Language: Telugu
మిత్రులారా,
గత నవంబర్ 3-4, 2018 తేదీలలో మెల్ బోర్న్, ఆస్ట్రేలియాలో దిగ్విజయంగా జరిగిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక (Proceedings of the Conference) ఇందుతో జతపరుస్తున్నాం.
కాస్త ఆలస్యంగా ఈ సంచిక వెలువడడానికి అన్ని ప్రసంగ వ్యాసాలనీ సమకూర్చుకోవడం, సదస్సులో రెండు రోజుల పాటు జరిగిన అన్ని అంశాలనీ పొందు పరచడం, మొత్తం సంచిక రూపకల్పనా వెరసి అనేక వైవిధ్యమైన అంశాలతో, ఇంత క్లిష్టమైన ఈ సంచిక రూపకల్పనకి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సమయమూ, వ్యయమూ వెచ్చించవలసి వచ్చింది. ఇందులో ఏమైనా తప్పులు దొర్లినా, ఏ విషయాన్ని అయినా పొందుపరచలేక పోయినా అవి మా ప్రయత్న లోపంగా కాక కేవలం కాకతాళీయంగా జరిగినవే అని సహృదయంతో అర్ధం చేసుకుని మమల్ని మన్నించమని అర్థిస్తున్నాం.
ఈ సంచికని మీరు పూర్తిగా చదివి ఆస్వాదించి అందరితో పంచుకోమని సవినయంగా కోరుతున్నాం.
6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మెల్ బోర్న్లో విజయవంతంగా జరగడానికి కారకులైన ఆస్ట్రేలియా తెలుగు సంఘం (TAAI) వారికీ, అనేక దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకీ మరొకసారి మా ధన్యవాదాలు.
- వంగూరి చిట్టెన్ రాజు
మల్లికేశ్వర రావు కొంచాడ
