• Aratera Tisina Rangasthalam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అరతెర తీసిన రంగస్థలం (free)

    Aratera Tisina Rangasthalam - free

    Publisher: Palapitta Books

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దాదాపు రెండున్నర దశాబ్దాల పైబడిన సాహిత్య ప్రయాణం డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిది. ఇరవయ్యేళ్ళ కిందటనే 'సమాంతర స్వప్నం' కవితా సంపుటితో సాహిత్య ప్రపంచానికి పరిచితులయ్యారు. కేవలం కవితా ప్రక్రియకే పరిమితం కాలేదు. పద్యం, పాట, కథ, సమీక్ష, విమర్శ, వ్యాసరచన, అనువాదం వంటి ప్రక్రియల్లోకి నరసింహారెడ్డి సాహిత్య వ్యాసంగం విస్తరించింది. నిశ్శబ్దంగా తనదైన రీతిన సాహితీయానం సాగిస్తున్న నరసింహారెడ్డి రచనలపై సాహిత్యలోకం సముచితంగా స్పందిస్తూ వచ్చింది. ఇదే క్రమాన ఆయన వెలువరించిన 'కొత్తపలక'ని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ కవితా సంపుటిగా గుర్తించి పురస్కారం ప్రదానం చేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నరసింహారెడ్డి రచనలపై వచ్చిన సమీక్షలు, వ్యాసాలు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒకచోట చేర్చడమైంది. ప్రత్యేకించి నరసింహారెడ్డి సాహిత్యనేపథ్యం మరింత ఆసక్తికరమైంది. తెలంగాణ నేల మీద కవిగా, రచయితగా ఎదిగి రావడానికి ఎంతగా శ్రమపడవలసి వచ్చిందో ఈ నేపథ్యం చదివితే తెలుస్తుంది. దారులు లేనిచోట దారులు వేసుకుంటూ రావడం చెప్పుకోదగిన విషయం. ఇవాళ సాహిత్యరంగంలో సుపరిచితుడయిన సృజనశీలిగా ఏనుగు నరసింహారెడ్డి మన ముందు నిలబడ్డారు. ఆయన సృజనశీలత్వంలోని మేలిమికోణాల్ని అర్థం చేసుకోడానికి ఉపకరించే స్పందనల సమాహారం ఈ పుస్తకం. సాహిత్య ప్రపంచంలో ఏనుగు నరసింహారెడ్డి చేసిన కృషి ఔన్నత్యాన్ని చెబుతుంది. అంతేగాక నరసింహారెడ్డి సాహిత్యాన్ని వివేచిస్తూ, తెలుగు సమాజ, సాహిత్య ప్రపంచాల్లోని పరిణామాల్ని రికార్డు చేసిన విశ్లేషణలు దీనిలో అనేకం. కనుకనే సాహిత్యంలోని విభిన్నధోరణుల విశ్లేషణలకీ, సాహిత్యచరిత్ర రచనకీ ఉపకరిస్తుందన్న ఆకాంక్షతో ఈ పుస్తకం తీసుకొచ్చాం.

- పాలపిట్ట బుక్స్