• Aradhana Revised Edition - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆరాధన - రివైజ్డ్ ఎడిషన్ (free)

    Aradhana Revised Edition - free

    Author:

    Pages: 95
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


దినమంతా మేఘాలు క్రమ్మినపుడు
అమ్మ ఒడిలో ఉన్నప్పటి పసితనం వదిలిపోలేదని అర్ధమైంది


నా మౌనం అరణ్యనిశ్శబ్దంలో లయం అయినప్పుడు
నా నిట్టూర్పు కెరటాలచే ఆహ్వానించబడినప్పుడు
నేను జీవించే ఉన్నానని నాకు స్పష్టమౌతోంది


ఈశ్వరుడు ఎక్కడో ఉన్నారన్న భ్రమ నానుండి దూరమౌతోంది
విశ్వసౌందర్యం చేసే అవిశ్రాంతనర్తనాన్ని చూడగలుగుతున్నాను
కాలవాహినిలా ప్రవహించే అమరగానాన్ని వినగలుగుతున్నాను


ప్రపంచమే ఈశ్వరుడనీ,
నేను ఈశ్వరునిలో కలిసాననీ అర్థం చేసుకొంటున్నాను


ఇప్పుడు జననం, మరణం
అర్థరహితమైన పదాలుగా కనిపిస్తున్నాయి


నేనెప్పుడు పుట్టానో నాకు తెలియటం లేదు
నేను మరణిస్తానన్నది అర్థంకావటం లేదు

- బివివి ప్రసాద్