• Apragnaata Yagnam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అప్రజ్ఞాత యజ్ఞం

    Apragnaata Yagnam

    Pages: 85
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

కాళీపట్నపు రామారావు మాస్టారి 91వ జన్మదినం సందర్భంగా వారి రెండు సుప్రసిద్ధ కథలు - "అప్రజ్ఞాతం", "యజ్ఞం" లను కావ్య పబ్లిషింగ్ హౌజ్ వారు పుస్తకంగా అందిస్తున్నారు.

* * *

అలనాటి యజ్ఞం గురించి ఇటీవల మళ్లా చర్చ ప్రారంభమయ్యిందని విన్నాను.

దాని ప్రభావమో, లేక ఇంకేదో కారణమో - తెలియదు. చరితా గ్రాఫిక్స్ సుబ్బయ్యగారు ఆ ఒక్క కథనే పుస్తకంగా తేదలచారని శాయి గారు ఫోన్ చేశారు.

కాదనడానికి వల్ల కాదు - కథానిలయమూ నేనూ కూడా వారికీ వారి సంస్థలకూ రుణపడి ఉన్నాము. సరే నన్నాను.

ఒక రాత్రల్లా క్రిందా మీదా పడి - దానితో పాటు అప్రజ్ఞాతం కూడా వేయగలరా - అన్నాను. వారు సరే నన్నారు.

అలా అడగాలని నాకెందు కనిపించిందంటే - నేను బాగా గౌరవించే ఓ పెద్దాయనికి యజ్ఞం కంటే అప్రజ్ఞాతమే బాగా నచ్చింది. నాకు చాలా ఆశ్చర్యమయ్యింది.

అప్రజ్ఞాతం 1951లో రాసింది - కథకుడిగా స్థిరపడుతున్న తొలి దశలో.

వస్తుశిల్పాల అవగాహన పెరిగాక (లేదా పెరిగిందని నేననుకున్నాక) 1964లో రాసింది 'యజ్ఞం'.

ఆ పెద్దాయనను అర్థం చేసుకోవడం కోసం - ఆ రెండింటినీ - ఒక పాఠకుని దృష్టితో చదివాను.

రెండూ కథలు కావు కథానికలే - వస్తు సమగ్రతలో కొంత తేడాలున్నా రెండింటా వస్తువు ఒక్కటే. శిల్పంలోనే తేడా అనిపించింది.

నా జ్ఞాపకాల మేరకు -

యజ్ఞం కథానికకు 'బీజం' ముందు పుట్టి, దాని వ్యక్తీకరణకు అవసరమైన నేపథ్యం సన్నివేశాలూ సంఘటనలూ పాత్రలూ వాటి వాటి చిత్రీకరణలూ తర్వాత పుట్టాయి.

అప్రజ్ఞాతం తొలి దశ కథానిక కావడం వల్ల - అందులోని కథాంగాలన్నీ చిన్న చిన్న మార్పులతో యథాతథంగా చిత్రితమయ్యాయి. అందులోని ముగింపు మాత్రమే కల్పితం.

అయితే అప్రజ్ఞాతంలో అసలు వృద్ధుల గణితముంది. బాగా ఎదిగిపోయిన పాఠకులని అలా ఉంచితే - ఇంకా ఎదగని పాఠకులకు కూడా 'యజ్ఞం'లో అప్పల్రాముడి సంకటస్థితిని ఆ గణితం అర్థం చేయించగలుగుతుంది.

- కాళిపట్నం రామారావు

Preview download free pdf of this Telugu book is available at Apragnaata Yagnam