• Apoorva Russian Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అపూర్వ రష్యన్ జానపద కథలు

    Apoorva Russian Janapada Kathalu

    Author:

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
చిట్టి పొట్టి పాపల్లారా
చిరునవ్వుల చిన్నారుల్లారా
అల్లీబిల్లీ ఆటలతోటీ
అల్లరి చేసే చిరుతల్లారా
ఆటలు పాటలు కొంచెం ఆపి
చక్కని ఈ కథ వినండి చెబుతా!

చిన్నారులూ! నా మొదటి పుస్తకం “రష్యన్ జానపద కథలు" చదివి ఆనందించారు కదూ. మరికొన్ని రష్యన్ జానపద కథల్ని అనువాదంచేసి మీకోసం ఈ పుస్తకం తెస్తున్నాను. ఇందులో ప్రసిద్ధి చెందిన గొప్ప రష్యన్ చిత్రకారుల చక్కని బొమ్మలున్నాయి.

మీలాగే నాకూ బొమ్మలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు రాత్రిపూట మా అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ, ఆకాశంలోని చందమామలో అస్పష్టంగా కనిపించే చిత్రాల్ని చూపిస్తూ, చందమామలో ఓ ముసలమ్మ రాట్నం వడుకుతూ తన కొడుకు కోసం ఎదురుచూస్తుందని చెప్పేది. ఎప్పటికైనా ఆ కొడుకు తల్లిని చేరుకోలేకపోతాడా అని రోజూ ఆ కథ ఆసక్తికరంగా వినేవాడ్ని.

ఆ తరువాత రంగురంగుల బొమ్మలంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. బొమ్మల్ని చూస్తూ ఎన్నో చక్కటి కథల్ని చదివాను. చిన్నప్పుడు నేను చదివిన చందమామ, బాలమిత్ర కథలు ఇప్పటికీ గుర్తున్నాయి. అందుకు కారణం కథల్లో ఉన్న బొమ్మలే. అలా చిన్నప్పుడే బొమ్మల ప్రేమలో పడ్డాను.

మీకు కూడా నాలాగే అందమైన బొమ్మలున్న కథల పుస్తకాలంటే ఇష్టం కదూ! ఇందులో ఉన్న చక్కటి జానపద కథలు, చిత్రకారుల రంగురంగుల బొమ్మలు మీకూ నచ్చుతాయి. మరిక ఆలస్యం ఎందుకు? చదివి ఆనందించండి.!

- అనిల్ బత్తుల

Preview download free pdf of this Telugu book is available at Apoorva Russian Janapada Kathalu