• Aparichitam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అపరిచితం

    Aparichitam

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆద్యంతాలు అర్థం కాని ఓ తంత్రీ, తన ధనష్టంకారానికి తానే ఒణికి ఒడుపు తప్పిన వింటినారి, మూర్ఛనల మోహ తీవ్రతకి తెగిన వీణ తీగ, నింగి పందిరి పట్టు తప్పి మబ్బుదుబ్బుల మీద జారిపడిన తటిల్లత... అది ఏదైనా కావచ్చు.

"మా అమ్మాయి..." అంటూ ప్రవాసి చేత పరిచయం చేయబడుతున్న ఆమె కూడా కావచ్చు. పరిసరాల స్పృహ మరచి నేను తననే తన్మయంగా చూస్తుంటే తాను దాచుకోలేకపోయిన మెలికల ఇబ్బంది కావచ్చు. ఇంగితాన్ని వదిలేసి వాళ్ళ పరువు తీస్తున్నానని మిత్రులు ముడివేసిన భృకుటి రేఖ కూడా కావచ్చు - ఆ పెయింటింగ్‌లో గీత!

నిజానికి నేను తేరిపార చూసింది ఆమెను కాదు. సర్దుకోని అలక్ష్యానికి ఒత్తైన ఒంకీల అలలై భుజాలపైకి జీరాడుతున్న ఆకాశవల్లి అడివితీగల్ని కాదు; పలకరింపు నవ్వులు చక్కిలిగుంటల బుగ్గలై ఊరితే చికిలించుకుపోయిన రెండు కాంతిపుంజాల్ని కాదు; ఏ కాలాలు దాయలేని ఏడు మల్లెలెత్తుని నిరలంకారం చేయాలని చూస్తున్న బోసిమెడని, నగ్న పాదాల్ని కూడా కాదు. కనిపించని క్రమశిక్షణతో కలగలిసిన రంగులు కుంచె అంచుల్లోంచి చిక్కగా జారి పాలరాతి గచ్చు మీద వేసిన abstract painting వంటి ఆమెని కానే కాదు, నేను తదేకంగా చూసింది. ఆ మాటకొస్తే, నేను తనని చూడటం అదే మొదటిసారి కాదు. అంతకుముందు ఎన్నోసార్లు చూశాను. చూశానని తెలుసు కానీ, ఎప్పుడు, ఎక్కడ.. అన్నది గుర్తు రాకపోవడం వల్లే అలా చూపులా అనిపించే ప్రయాణం చేశాను, గడిచిన యుగాల్లోకి, గత జన్మల్లోకి.

ఆమెని ఏ గ్రహాంతరాల్లో కలిశానన్నదొక్కటే నా ప్రశ్న కాదు, ఆమె ఎవరన్నది కూడా నా ప్రశ్నే.

గమనిక: “అపరిచితం” ఈ-బుక్ సైజు 8.44 mb

Preview download free pdf of this Telugu book is available at Aparichitam