• Anubhavalu Panchukundam 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవాలు పంచుకుందాం-2

    Anubhavalu Panchukundam 2

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 243
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన సంకలనం.

ఈ పుస్తకంలో పిల్లల అనుభవాలు, ఉపాధ్యాయుల అనుభవాలు ఉన్నాయి. ఓ మారుమూల గ్రామంలో పనిచేసే టీచర్ తన అనుభవాన్ని వివరిస్తున్నారిలా...

* * *

నేను నెల్లూరు జిల్లా, కొండపురం మండలంలో గుడవళ్ళారు ప్రాథమిక పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నాను. ఒక రోజు నేను 5వ తరగతి విద్యార్థులకు ''ఐక్యరాజ్య సమితి'' పాఠం చెపుతున్నాను. నేను పాఠం చెప్పేటప్పుడు ఎక్కువగా పిల్లలను ప్రశ్నించమని చెపుతాను. పిల్లలు ''ఐక్యరాజ్య సమితి'' పాఠానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి కొందరు తోటి పిల్లలు, కొన్నింటికి నేను వివరణ ఇస్తున్నాం. పాఠంలోని విషయాలకు ప్రస్తుత యుద్ధ పరిస్థితి కూడ జోడించి వివరణలు ఇస్తున్నాం.

ఇంతలో ఒక విద్యార్థి ''అసలు సైనికులు ఎందుకు టీచర్‌? ఏ దేశానికీ సైన్యం లేకపోతే యుద్ధమే రాదుగదా!'' అని అడిగాడు. వెంటనే నాకు ఏమి చెప్పాలో తోచలేదు. ఏదో ఒకటి సర్దిచెప్పాను. కానీ ఆ ప్రశ్న నాకు పదేపదే గుర్తుకువస్తుంది. పిల్లలు లేవనెత్తిన ఇంత చిన్న ప్రశ్న అంత అంతర్జాతీయ సమాజానికి ఎందుకు తలెత్తలేదు?

- కె. శైలజ

* * *

ఇలాంటివి ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. పిల్లలూ, పెద్దలూ నేర్చుకోదగ్గ విషయాలున్న పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Anubhavalu Panchukundam 2