• Anubhavalu Panchukundam 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవాలు పంచుకుందాం -1

    Anubhavalu Panchukundam 1

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 219
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన సంకలనం.

ఈ పుస్తకంలో పిల్లల అనుభవాలు, ఉపాధ్యాయుల అనుభవాలు ఉన్నాయి. ఓ మారుమూల గ్రామంలో పనిచేసే టీచర్ తన అనుభవాన్ని వివరిస్తున్నారిలా...

* * *

అవి నేను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. నన్ను ఓ మారుమూల గ్రామానికి వేసారు. గ్రామంలో ఉన్నవాళ్ళంతా వ్యవసాయ కూలీలు. ఒకసారి రెండురోజులు బడికి సెలవులిచ్చారు. నేను సోమవారం కొంచెం బద్ధకంగా లేచి బడికిపొయ్యాను. కొంచెం ఆలస్యమైనట్టుంది. అప్పటికే పిల్లలు కప్పులు ఎగిరిపొయ్యేలా, నేల అదిరి పొయ్యేలా అరుస్తున్నారు, గంతులు వేస్తున్నారు. నేను బళ్ళో అడుగుపెట్టగానే పిల్లలందరూ ఒకడి చుట్టూ చేరి ''గుండు గుండు బోడి గుండు,'' అంటూ వెక్కిరించి వేళాకోళం చేస్తున్నారు.

నన్ను చూసి పెద్దమనుషుల్లా నా చుట్టూ కూచున్నారు.

మధ్యాహ్నం ఆ అబ్బాయి ఇంటికెళ్ళి బడికి రాగానే మళ్ళీ పిల్లలు అదే గోల మొదలెట్టారు. వాడిని ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టారు. నేను ఆ అబ్బాయిని చూద్దునుగా, గుండు అరకొరగా ఉంది. అక్కడక్కడ వెంట్రుకలున్నాయి.

నేను ఆ అబ్బాయిని పిలిచి ''గుండు ఎక్కడ చేయించుకున్నావురా, తిరుపతికి వెళ్ళావా?' అన్నాను. లేదన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. ''పోనీ తలలో కురుపులు లేచాయా? అందుకని గుండు చేయించారా?'' అని ప్రశ్నించాను. ''లేదండీ,'' అన్నట్టు మళ్ళీ తల ఊపాడు.

''మరి ఇంకెందుకురా గుండు చేయించుకోవడం? అదైనా సరిగా చేయించుకోకూడదా? ఎవరి దగ్గర చేయించుకొన్నావురా?'' అని రెట్టించాను.

వాడికి ఏడుపొచ్చేస్తోంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ''ఇంట్లో కొబ్బరినూనె లేదని మా అమ్మే గుండు చేసింది సార్‌!'' అంటూ వినపడీ వినబడనట్టు చెప్పి చొక్కాతో కళ్ళు తుడుచుకొంటున్నాడు.

ఒక్కసారి నా గుండెల్ని పిండేసినట్లయి అవాక్కయిపోయాను.

- పి. మీనాకుమారి

* * *

ఇలాంటివి ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. పిల్లలూ, పెద్దలూ నేర్చుకోదగ్గ విషయాలున్న పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Anubhavalu Panchukundam 1