• Anubhava Satyalu Animutyalu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవ సత్యాలు - ఆణిముత్యాలు

    Anubhava Satyalu Animutyalu

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అనుభవ సత్యాలు - ఆణిముత్యాలు'
సబ్బని అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా అనుభవం లోకి వచ్చిన విషయాలను చిన్నవాక్యాలుగా పేస్ బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. అవి నాలుగు వందలు దాటినాయి. వాటిని " అనుభవ సత్యాలు - ఆణిముత్యాలు" పేర పుస్తకరూపములో తీసుక వచ్చాడు.
సబ్బని కలము నుండి సజీవ ధార లాగా వెలువడిన మచ్చుకు కొన్ని సూక్తులు.
* పేరు, కీర్తీ అని పరిగెత్తకు, పనిచేస్తూ పో, పేరు, కీర్తీ అవే వస్తాయి.
* గడియారం లోని లోలకంలా, గుండె గడియారం కూడా క్రమ పద్ధతిలో కొట్టుకుంటే ప్రశాంతత, ఆరోగ్యం మనిషికి.
*కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, బాధ ఉండదు.
* రవిని, కవిని పట్టించుకోకున్నా , వారు లోక బాంధవులు.
*ఎదురుచూస్త్తూ ఉండడం కంటె పని చేస్తూ పోవడం మంచిది, ఫలితం ఉంటుంది.
*అదృష్టమంటే విజయం యొక్క చివ్వరి మెట్టు.
*అవినీతి అంటురోగం లాంటిది, ఎంతటి వారినైనా వదులదు.
*కొందరు ప్రతిభతో, కొందరు పదవితో వన్నెకెక్కుతారు.
*జీవితానికి విజన్ అవసరమే, దానికి ప్లానింగ్, ఆచరణ , అమలు తోడయితే ప్రగతి పథమే.
* కడుపు నిండా తిండి తినగలిగిన వాడు, కంటి నిండా నిద్ర పోగలిగిన వాడు, ఆరోగ్యవంతుడు, అదృష్టవంతుడు.
* ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కానీ ఆరోగ్యం మనిషి సత్ శీలతల ఫలితం.
*చెప్పులు లేక చెప్పులు ఉన్నవాడితో, అప్పులు లేక అప్పులు ఉన్న వాడితో వెళ్ళకు, కష్టాలు, నష్టాలు వస్తాయి
*మూర్ఖులతో వాగ్వివాదం కంటె మౌనంగా ఉండడం మంచిది.
*మనసే చుక్కాని మనిషికి.
ఇలా సబ్బని తన జీవితానుభవం లోని విషయాలను 434 వాక్యాల మాలగా కూర్చి 'అనుభవ సత్యాలు - ఆణిముత్యాలు' పుస్తక రూపములో అందించారు.

Preview download free pdf of this Telugu book is available at Anubhava Satyalu Animutyalu