• Antaryuddham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    144
    58.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర్యుద్ధం

    Antaryuddham

    Pages: 285
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

''ఎస్‌.పీ. సార్‌! మీ వెరిఫికేషన్‌ నాకొద్దు... మీ ప్రొటెక్షనూ నా కొద్దు. మీరు మంచి ఎస్‌.పీ. అని అందరూ చెప్పారు కాబట్టి నేను మీ దగ్గర కొచ్చాను. నా కోసం ఒక హెల్ప్‌ చెయ్యగలరా అని అడగడాని కొచ్చాను.''

''చెప్పండి!''

''నా భర్తని మర్డర్‌ చేసిన ఆ బసవడు వెనక ఏ అధికార పార్టీ ఉందో నాకు తెలుసు. అతన్ని ఎవరూ ఏం చెయ్యరని, చెయ్యలేరని నాకు తెలుసు. పోలీసు స్టేషన్లు అతని గెస్ట్‌హౌస్‌లని, కోర్టులు అతని ప్లే గ్రౌండ్సనీ నాకు తెలుసు. ఆ బసవడ్ని ఒక్కసారి, కనీసం ఒక్కసారి చూడాలని వుంది. అతన్ని నాకు చూపించే ఏర్పాటు చెయ్యగలరా?'' చాలా విచిత్రమైన కోరికను కోరుతున్న సుధ వేపు ఎస్‌.పి. అక్షిత్‌, అక్కడున్న నర్సింహం, మరికొంత మంది పోలీస్‌ అధికారులు ఆశ్చర్యంగా చూశారు.

''నా వల్ల అతనికేమీ ప్రమాదం వుండదు. మీకు తెలుసు. నేను అతన్నెందుకు చూడాలనుకుంటున్నానో చెప్తాను. నిజంగా ప్రజల కోసం బతుకుతున్న ఒక నాయకుడ్ని నువ్వెందుకు చంపాలి- నన్నూ, నా పిల్లల్నీ రోడ్డుమీద పడేసే హక్కు నీకెవడిచ్చాడు... రేపు ఇంకొకడి చేతిలో నీ బతుకూ అలాగయితే, నీ భార్య, పిల్లలు ఏమవుతారో ఆలోచించావా? అంతే... వాడ్ని నేనడిగే ప్రశ్నలివే. అంతకంటే మరేం లేదు'' పొంగుకొస్తున్న దుఃఖాన్ని, ఉబికొస్తున్న ఉద్రేకాన్నీ అణుచుకోడనికి ప్రయత్నిస్తోందామె.

ఎస్‌.పి. అక్షిత్‌ ఆలోచనలో పడ్డాడు.

''ఇమ్మీడియట్‌గా వాడ్నలా తీసుకురావడం కుదరదమ్మా. మా అఫీషియల్స్‌తో ఒకసారి మాట్లాడాలి'' ఇంకేదో చెప్పబోయాడు ఎస్‌.పి.

Preview download free pdf of this Telugu book is available at Antaryuddham
Comment(s) ...

I think this is a old novel of this author.
Not upto mark
Not