• Antarmathanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర్మథనం

    Antarmathanam

    Pages: 136
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ప్రచారయుగం. దానికి తోడు విపరీతమైన వేగం. ఈ ప్రచార ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి బ్రతకడం గగనమైపోతున్నది. ఇక ఆగి ఆలోచించే తీరిక ఎక్కడిది!

డబ్బు సంపాదన, సుఖాల అనుభవాలు వ్యక్తి విజయానికి కొలబద్దగా మారుతున్న సమయంలో సున్నిత భావాలకు తావెక్కడ?

ఏ విషయాన్నైనా పైపైన స్పృశించి వదిలివేయడం తప్ప, లోతుగా ఆలోచించే తీరిక ఎక్కడ?

ఇటువంటి ప్రచార ప్రవాహంలో వేగవంతమైన జీవనంలో కొట్టుకుపోతున్న యువకుడు శరత్. సమాజంలో నెలకొనివున్న అనేక వైరుధ్యాలను ద్వంద్వ ప్రవృత్తులను జీర్ణించుకోలేకపోతాడు. ముఖ్యంగా ప్రేమ విషయంలో జరుపుతున్న ప్రచార ప్రభావాలకు లోనై న్యూనతాభావానికి గురవుతాడు. హృతిక్‌రోషన్‌లాగా కండలు లేవు, హీరోల్లా పాడలేడు. విలన్‌లను తన్నలేడు. కార్లూ మేడలూ లేవు. సగటు మధ్యతరగతి మనిషి శరత్. తనలో ఒక యువతిని ఆకర్షించేందుకు ఏముంది? ఏమీ లేని తనని ఎవరు మాత్రం ఎందుకు ఇష్టపడతారు? ఇటువంటి ఆలోచనలకు లోనై శరత్ ప్రేమరాహిత్య భావన ద్వారా డిప్రెషన్‌కు లోనవుతాడు. ఈ నిరాశావద సుడిగుండంలో చిక్కుకున్న యువకుడి అంతరంగమథనం వల్ల జనించిన హాలాహాలాన్ని విశ్లేషిస్తూ అమృత సాధన మార్గశోధన కథనం "అంతర్మథనం"

Preview download free pdf of this Telugu book is available at Antarmathanam