• Antarani Vasantam Vimarsanatmaka Pariseelana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 71.4
    84
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంటరాని వసంతం విమర్శనాత్మక పరిశీలన

    Antarani Vasantam Vimarsanatmaka Pariseelana

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అంటరాని వసంతం' నవలని కూలంకషంగా చర్చించిన రచన ఇది. అయిదు అధ్యాయాల్లో వున్న ఈ గ్రంథం అకాడెమిక్‌ ప్రమాణాల్ని ఉన్నతీకరించింది. నవలావిమర్శలో ఉదాత్తమైన విలువల్ని అంటరాని వసంతం విమర్శనాత్మక పరిశీలన పాటించింది. నవలలోని ఇతివృత్తాన్ని, ఆ ఇతివృత్తానికి భూమికగా ఉన్న నేపథ్యాన్ని సవివరంగా చర్చించింది. నవలలోని రచనాశిల్పం మీద ప్రత్యేకదృష్టి నిలిపి సాధికారికంగా విశ్లేషించడం ఈ సిద్ధాంత వ్యాసం ప్రత్యేకత. ఎంచుకున్న వస్తువుకు కళారూపం ఇవ్వడంలో రచయిత సాధించిన విజయాన్ని సోదాహరణంగా నిరూపించడమే సామాన్య పరిశోధనలోని సాఫల్యం. సామాన్య ఉపయోగించిన పదజాలం విమర్శనా పరిభాషకు ఓ అందాన్ని ఇచ్చింది. దళిత సాహిత్య విమర్శ విస్తృతికీ, తెలుగు నవలా విమర్శ ఉన్నతికీ ఉపకరిస్తుందీ రచన.

* * *

అంటరాని వసంతం తరాల సామాజిక చిత్రణ ఉన్న నవల. ప్రజలలో ఒక సమూహమై అందరిలాగే మనిషిగా జన్మించి, వికృతమైన అస్పృశ్యతకి, ఆకలికి, తోటి మానవుడి క్రౌర్యానికి బలైన దళితుల జీవన చిత్రణ ఉన్న నవల ఇది. మొదటి తరం మాల మాదిగల స్థితి, ఏడవ తరం అంటే ప్రస్తుత సమాజంలో వారి స్థితి, అక్కడి నుండి ఇక్కడి వరకు వారి నిమ్నోతాలు, ఎవరికి వారు ఎంచుకున్న పరిష్కారం మొదలగు వాటిని స్వయాన దళితుడైన రచయిత తీవ్రంగా స్పందిస్తూ రాశారు. కొత్త శతాబ్దిలో వచ్చిన ఈ విశిష్ట నవలపై సాధికారకమైన విశ్లేషణ చేసిన సామాన్య రచన ఈ పుస్తకం. సాహిత్య పరిశోధనలో, విమర్శలో ఉన్నత ప్రమాణాలలో రూపొందిన ఉత్తమ గ్రంథమిది.

Preview download free pdf of this Telugu book is available at Antarani Vasantam Vimarsanatmaka Pariseelana