• Annamacharya Samkeertanala pai Naalayira Divya Prabandha Prabhaavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 127.2
    141.6
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అన్నమాచార్య సంకీర్తనలపై నాలాయిర దివ్యప్రబంధ ప్రభావం

    Annamacharya Samkeertanala pai Naalayira Divya Prabandha Prabhaavam

    Pages: 246
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధుజీవనాన్ని గడపడంలోనూ, ప్రజోపయోగంగా సాహిత్యాన్ని సృష్టించడంలోనూ ఎన్నో సామ్యాలు కలవారు ఆళ్వారులు, అన్నమయ్య గానయోగ్యమైన సాహిత్యాన్ని వీరు సృష్టించారు. సంగీత సాహిత్యాలకు సమప్రాధాన్యాన్నిచ్చారు. ఆలోచన, ఆచరణ, సంస్కరించాలనే తపన, దేశకాల పరిస్థితులు వేరైనా అన్నమయ్య, ఆళ్వారుల మధ్య ఏకరూపతను కలిగించాయి.

వైష్ణవమత వ్యాప్తికోసం ఆళ్వారులు సాహిత్యాన్ని సృష్టించారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణదేశంలో ఆళ్వారుల ప్రభావం, వైష్ణవమత ప్రచారం అధికంగా ఉన్న కాలంలో జన్మించిన అన్నమయ్య జీవనం, హృదయం, ఆశయం వైష్ణవమే అయ్యింది. ఆ వైష్ణవంలో ఆరాధ్యులయిన ఆళ్వారులు కూడా ఆరాధ్యులే అయ్యారు. అందుకే సంకీర్తన ప్రక్రియను, ప్రజలకు ప్రచారం చేయడంకోసం, ప్రజల భాషలోనే రచించాడు. అన్నమయ్యలోని కవి, సంస్కర్త, గాయకుడు, భావుకుడు జాగృతుడై ఉద్భవించడంలో ఆళ్వారుల ప్రభావం ఎంతగానో ఉంది. ఈ ప్రభావాన్ని పరిశోధించే దిశలో ఇంతకుముందు కొన్ని పరిశోధనలు జరిగాయి. అయినా అన్నమయ్యపై ఆళ్వారుల ప్రభావం అనంతమైనది. అక్షరాక్షరమూ వెదికి చూస్తే ఎన్నో విలువైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ విషయాన్ని నా ఎరుక ద్వారా కొంత, సాహిత్యంలోనూ, వైష్ణవ సంప్రదాయంలోనూ విజ్ఞులైన వారిని కలుసుకొని చర్చించడం ద్వారా మరికొంత తెలుసుకొని, వారి ప్రోత్సాహం మీదట ఈ పరిశోధనకు ఉపక్రమించాను.

అన్నమాచార్య సంకీర్తనలకు మాతృకలైన ఆళ్వారుల పాశురాలను చూపడం అనే తులనాత్మక దృష్టే ఇక్కడ ప్రధానం అయినప్పటికీ కేవలం దానికే ఈ పరిశోధన పరిమితం కాదు.

ఆళ్వారులలోనూ అన్నమయ్యలోనూ సాదృశ్యంగా కన్పించే కొన్ని కీలకమైన అంశాలను స్వీకరించి, వాటి నేపథ్యాలను అటు సంప్రదాయంలోనూ ఇటు సాహిత్యంలో పరిశీలించడం, వాటి ప్రాశస్త్యాన్ని, ప్రస్తావించడం నా ఈ పరిశోధనలో ప్రధానోద్దేశ్యం.

- రచయిత్రి

Preview download free pdf of this Telugu book is available at Annamacharya Samkeertanala pai Naalayira Divya Prabandha Prabhaavam