-
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు - (1919 - 2010)
AndhraPradesh Rashtra Rajakeeyalu 1919 2010
Author: Maramraju Satyanarayanarao
Pages: 316Language: Telugu
మన దేశంలో రాష్ట్రాలు, ఎలా ఏర్పడ్డాయి? ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది? ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాల పూర్వపరాలేమిటి? వాటికి విభజనోద్యమాల నేపథ్యం ఏమిటి? మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా వివరించేదే ఈ గ్రంథం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలను అవగాహన చేసుకోవడానికీ, భవిష్యత్తును అంచనా వేయడానికీ ఉపయోగపడే రచన ఇది. రాష్ట్ర రాజకీయాల సమీక్షకు దోహదకారి. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి, అధ్యయన దృష్టి కలవారు తప్పక చదవాల్సిన గ్రంథం.
మారంరాజు సత్యనారాయణరావు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజకీయశాస్త్ర విభాగంలో ఆచార్యులుగా, రిజిస్ట్రారుగా, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాల తీరుతెన్నులపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిద్ధాంత వ్యాసం సమర్పించి పి.హెచ్.డి. పొందారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాలు, ఎన్నికల రాజకీయాలు అన్న ఆయన రచనలు బహుళ ప్రచారం పొందాయి. పదవీ విరమణ తర్వాత ఖమ్మంలో విద్యాసంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించి ఇటీవలే యాభైఏళ్ళ విద్యసేవ పూర్తి చేశారు.
