• Andhra Rachayithalu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 336
    420
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆంధ్ర రచయితలు

    Andhra Rachayithalu

    Pages: 439
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్ర రచయితలు

113 కవుల సాహిత్య జీవన చిత్రణ

శ్రీసత్యనారాయణ శాస్త్రిగారి యీ గ్రంథ నిర్మాణమాయా గ్రంథకర్తల దేశకాలములు గ్రంథముల పేళ్ళు మచ్చు పద్యములు నను తీరున గాక ధ్వని ప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది. కొందరు కవులు గూర్చి వీరు నెరపిన ప్రశంసా వాక్యములలో కొన్ని పలుకుబళ్ళై భాషలో పాదుకొనిదగియున్నవి. శాస్త్రిగారు పద్య రచనమందు, గద్యరచనమందును మంచి వైపువాటములెరిగిన జగజాణలు.

- వేటురి ప్రభాకర శాస్త్రి

* * *


నిరుటి శతాబ్దమున కన్ను
తెరచిన రచయితల తలల
సత్తా గుత్తకు గొని పెను
పొత్తము కెక్కించినావు

- డా. సి. నారాయణ రెడ్డి

* * *

ఈ గ్రంథము చదివిన - దిగ్గజముల వంటి అనేక జీవద్రచయితల గోష్ఠిలో పాల్గొనుచున్నట్లు విలక్షణానుభూతి కలుగును. దానంజేసి బుద్ధి నిశితమును ప్రతిభ నవనవోన్మిషతమును అగును. శ్రీశాస్త్రిగారు ఆశించిన పరమార్థమే ఇది.

- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

* * *

అడుగడుగునా ఆహా అనిపించే గడుసు పద ప్రయోగాలతో గారడీ చేసే విద్య కొందరికే వచ్చు. అందులో మీరు ఒకరు.. ఇప్పుడు ఒక్కరే.

- ఆరుద్ర

* * *

శ్రీ శాస్త్రి గారి లేఖిని నుండి జాలువారిన అపూర్వ రచన 'ఆంధ్ర రచయితలు' అనే వచన గ్రంథం. వీరేశలింగం గారి కవుల చరిత్ర కంటే ఈ గ్రంథ రచనా మార్గం భిన్నమైనది. ఈ గ్రంథంలో శాస్త్రిగారు పరవస్తు చిన్నయసూరి నుంచి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి వరకు, వారి వారి రచన విలువను తూచి వెలకట్టినారు. ఆయా కవుల కవిత్వమును గూర్చి శాస్త్రిగారు వెలువరించిన అభిప్రాయాలను చదివిన తరువాత 'ఇక చెప్పడానికి ఏమీ లేదు' అనక తప్పదు. రాగద్వేషాలకు అతీతమైన సాహిత్య విమర్శ వారిది. ఇలాంటి గ్రంథాలు ఆంగ్లంలో సుసులభాలు. 'గద్యం కవీనాం నికషాం వదంతి' అన్న పెద్దల సూక్తికి మంచి తారకాణ 'ఆంధ్ర రచయితలు'. శాస్త్రిగారి గద్య రచన అనన్యసాధ్యం అనిపిస్తుంది. శ్రీ మధునాపంతుల వారి కీర్తిని చిరస్థాయిగా చేయుటకు 'ఆంధ్ర పురాణము', 'ఆంధ్ర రచయితలు' చాలు. ఆంధ్ర పురాణకర్త, ఆంధ్ర రచయితల రచయిత, 'ఆంధ్రి' సంపాదకుడు పెట్టు బిరుదులు లేని శాస్త్రిగారికివి పుట్టు బిరుదులు. కేవల ప్రతిభావైదుష్యాలతో ప్రసిద్ధికెక్కి మహాకవి పదము నధిష్టించిన మధునాపంతులవారి మహత్తకు ఇవి మువ్వన్నెల యశఃపతాక.

Preview download free pdf of this Telugu book is available at Andhra Rachayithalu