• Anayasamga Atma Gnanama
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనాయాసంగా ఆత్మజ్ఞానమా?

    Anayasamga Atma Gnanama

    Pages: 155
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమకొద్దీ ఈ నిసర్గ సంభాషణలు అనువదించాను. జీవితం మీద ప్రేమ, నిసర్గ మీద ప్రేమ, తెనుగు అక్షరాలు చదివే వారిపై ప్రేమ - ఈ త్రివిధ ప్రేమ ఈ అనువాదాన్ని పురికొల్పింది.

మరాఠీ భాషలో మాట్లాడిన నిసర్గను, మారిస్ ఫ్రిడ్‌మెన్ అనే పోలిష్ జాతీయుడు అనువదించడానికి తాను మరాఠీ నేర్చుకొని, టేప్ చేసిన నిసర్గ సంభాషణల్ని ఇంగ్లీష్‌లోకి మార్చాడు. ఈ రచయిత అతడి వాక్యాలను తెనుగులోకి మార్చాడు.

మూలానికి హాని జరగకుండా ఈ అనువాదాలు జరిగినై. ఫ్రిడ్‌మెన్ సామర్థ్యాన్ని గానీ, ఈ తెనుగు అనువాదకుని త్రికరణశుద్ధిని గానీ శంకించ నవసరంలేదు. తెనుగు పాఠకుడి హృదయానికి ఇదంతా ఏదో విధంగా చేరాలని, లోపంలేని ప్రయత్నం చేశాను.

అనువాదంలో ఒక్కోసారి ఒక పదంతో సరిపెట్టుకోక, సమానార్థకమైన మరొక పదం కూడా వాడిన కారణం, ఏదో విధంగా ఆ భావాన్ని పాఠకుడికి అందజేయాలనే ఉద్దేశమే.

పుస్తకాన్ని తీరికగా రోజూ కాస్త కాస్త చదవండి. జిజ్ఞాసాపరులు ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవలసింది చాలా వుంది. ఆ విధంగా మొత్తం పూర్తయిం తర్వాత, ఏదో సమయాన పుస్తకం తెరవండి - ఏ పేజీ అయినా ఫరవాలేదు. అప్పటికి మీ అవగాహన గాఢమై వుంటుంది కాబట్టి, ప్రతి వాక్యమూ సావధానంగా గనక చూస్తే, మరింత లోతుగా అర్థమవుతుంది; క్షణంలో ధ్యానమగ్నులవుతారు. జీవితం వికసిస్తుంది.

- నీలంరాజు లక్ష్మీప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Anayasamga Atma Gnanama