• Ananda Jyothi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనంద జ్యోతి

    Ananda Jyothi

    Author:

    Pages: 419
    Language: Telugu
    Rating
    4.29 Star Rating: Recommended
    4.29 Star Rating: Recommended
    4.29 Star Rating: Recommended
    4.29 Star Rating: Recommended
    4.29 Star Rating: Recommended
    '4.29/5' From 7 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 3 premium votes.
Description

"విచ్చేశారు... దక్షిణదేశ యాత్రలను అర్థాంతరంగా ముగించుకుని వెనక్కి వచ్చేసిన రామానుజాచార్యుల వారు నగరంలోకి విచ్చేశారు..." అని కేకలు పెడుతూ ఆలయం దగ్గిరికి పరిగెత్తుకు వచ్చారు కొందరు పౌరులు.

కనుల్ని పెద్దవి చేసి హేమసుందరి వైపు చూస్తున్న పౌరులందరి వదనాల్లోను వెంటనే ప్రత్యక్షం అయ్యాయి విషాదఛాయలు.

"దొంగలు గుంపు వచ్చిపడుతున్నదన్న వర్తమానం అసత్యం కావాలని ఎంతో ఆశించాము. రామానుజాచార్యులవారి రాక ఆ మాటలను బలపరుస్తోంది. మన బ్రతుకులు సంశయంలో పడినట్లే ఇక..." తమలో తాము అనుకుంటూ, అవతలికి వెళ్ళిపోయారు శ్రీధరుడు మాట్లాడించ చూసిన పౌరులు ఇద్దరు.

మరో నాలుగు అడుగులు ముందుకు వేసి, యింకో పౌరుడిని సమీపించబోయిన శ్రీధరుడికి ఆ వీధి చివరిభాగంలో అగుపించింది ఒక ఊరేగింపు.

ద్రవిడ పాశురాల్ని సుమధుర కంఠాలతో గానంచేస్తూ వస్తున్నారు ఆ గుంపులోని వైష్ణవదాసులు అందరూ... ప్రధాన శిష్యులు ఇద్దరు కైదండలొసగుతుండగా ఊరేగింపు ముందుభాగంలో అడుగులు వేస్తున్నారు గురు రామానుజాచార్యులవారు.

స్ఫురదా పట్టణంలో చూసినప్పటికంటె, ఆయన బాగా నలిగిపోయినట్లు కనిపించారు శ్రీధరుడికి... నిరంతర భగవధ్యానంలో నిర్మలంగా వుండవలసిన ఆయన వదనం అలజడితో కాస్తంత కాంతిహీనంగా అగుపించింది అతని కనులకు.

Preview download free pdf of this Telugu book is available at Ananda Jyothi
Comment(s) ...

Very nice. The style of madhubabu is wonderful.

Ananda Jyothi is really well written book. Nice characters and smooth plot. Storytelling style is equal to Shadow novels. I am looking forward more good novels from Mr Madhu Babu.

Warm Regards,
Vishnu Guntaka