• Anamika Diary
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనామిక డైరీ

    Anamika Diary

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉదయం ఐదు గంటల సమయం... మసక చీకట్లింకా తొలగిపోలేదు.
కడుపునిండా కప్పల్ని మింగి మత్తుగా పడుకున్న కొండ చిలువలా ఉందా జైలు. కేవలం ఆడ ఖైదీలను మాత్రమే ఉంచే ఆ జైల్లో ఆ సమయానికి దాదాపు అందరూ నిద్రలు పోతున్నారు. కొంతమందికి మెలకువొచ్చినా బ్యారక్స్ తాళాలు ఎప్పుడు తెరుస్తారా అని అసహనంగా ఎదురుచూస్తున్నారు.
అప్పుడే లోపలికి ప్రవేశించిన జైలర్ యామిని అన్ని బ్యారక్‌ల తాళాలు తెరవమని కింది సిబ్బందికి హుకుం జారీ చేసింది. ప్రతిరోజూ ఐదింటికి జైలర్ వచ్చాకే ఖైదీలను కాలకృత్యాలు తీర్చుకోడానికి బైటికి వదుల్తారు. ఉదయం ఖైదీలకు ఫలహారాలు పెట్టడం పూర్తయ్యాక ఎనిమిదింటికి జైలర్ యింటికి వెళ్ళిపోయి మళ్ళా పదింటికి డ్యూటీకి వచ్చేస్తుంది.
ఏడు గంటల సమయం... పొగలు కక్కుతున్న కాఫీని కొద్దికొద్దిగా చప్పరిస్తూ తెలుగు దిన పత్రిక ముందేసుకుని వార్తలు చదవడంలో మునిగిపోయిన యామిని ”మేడం” అన్న పిలుపుతో తలయెత్తి చూసింది. ఎదురుగా లేడీ కానిస్టేబుల్... ఆమె చేతిలో రెండు పెద్ద సైజు నోటు పుస్తకాలున్నాయి. ‘ఏంటవి’ అన్నట్టు ప్రశ్నార్థకంగా కళ్ళు ఎగరేసింది.
“క్రిష్ణా బ్యారక్‌లో దొరికాయట మేడం. గదిని వూడుస్తున్నప్పుడు నిన్న ఖాళీ అయిన బెడ్ దులుపుతుంటే కన్పించాయట. మీ దృష్ణికి తీసుకురావడం మంచిదని...” తన చేతిలో ఉన్న రెండు నోటుపుస్తకాలని జైలర్ ఎదురుగా టేబుల్ మీద పెడుతూ అంది.
యామిని మొదటి పుస్తకం చేతిలోకి తీసుకుని అట్ట తెరిచి చూసింది. తెల్ల కాగితం మీద మధ్యలో బాల్‌పాయింట్ పెన్‌తో ‘అనామిక డైరీ’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. పక్క పేజీ తిప్పి చూసింది. పేజీ మొత్తం వాక్యాలతో నిండిపోయి.. అన్ని పేజీలూ అలానే ఉన్నాయి. పేజీకి పైన కుడి వైపున నంబర్లు వేసి ఉన్నాయి. చేతి రాత అందంగా లేదు. కోడి గెలికినట్టు చిన్నచిన్న అక్షరాలు...

Preview download free pdf of this Telugu book is available at Anamika Diary