• Amutkamalyada Victory Publishers
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆముక్తమాల్యద - విక్టరీ పబ్లిషర్స్

    Amutkamalyada Victory Publishers

    Publisher: Victory Publishers

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాయలవారి ప్రౌఢ ప్రబంధానికి సరళమైన వచనానువాదం అందిస్తున్నారు డా. కాసల నాగభూషణం.

* * *

తానే స్వయంగా కట్టిన చెంగల్వ పూదండలను, చెట్టులోనే పండిపోయిన పెద్ద అరటి గెలను తన చెలికత్తెలు తీసుకొస్తూ వుంటే వాళ్లతో పాటు గుడికి వెళ్లేది. నంబి అక్కడున్న జనాన్ని దూరంగా వెళ్లమని ఖాళీ చేయిస్తే ఈమె గుడిలోకి వెళ్లి స్వామికి నమస్కరించి విగ్రహం ముందున్న వేదిక మీద రకరకాలుగా రంగవల్లులు తీర్చేది. మంచి ఆవునేతితో దీపం వెలిగించేది. ''నారాయణాబ్జ చరణౌ శరణ మహంప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః'' అన్న ద్వయమంత్రాన్ని పఠిస్తూ స్వామి వక్ష స్థలాన్ని చెంగల్వ పూదండతో అలంకరించి అగరు ధూపం వేసి చక్కెర, నెయ్యి, అరటిపండు ఇత్యాది హృద్యమైన పదార్ధాలతో నైవేద్యం సమర్పించేది. వక్క పలుకులు, శొంఠి ముక్కలు, పచ్చకర్పూరం కలగలిసిన తాంబూలాన్ని భక్తిపూర్వకంగా నివేదించి చెలులతో కలిసి గర్భ గుడికి ప్రదక్షిణం చేసివచ్చి స్వామి ఎదుట నిలిచి తలవంచి శఠకోపం పెట్టించుకునేది. తీర్థం సేవించేది. స్వామివారి ప్రసాదంగా లభించిన పూమాలను సిగలో తురుముకుని చెలికత్తెలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేది.

ఇలా ప్రతిరోజు గుడికి వెళ్లి మహావిష్ణువును పూజించివచ్చిన తరువాత గోదాదేవి విరహవేదన ఎక్కువై ధైర్యం సన్నగిల్లిపోగా ఆ యదుకులేశ్వరుని గుణగణాలను ద్రావిడ భాషలో మధురాతి మధురంగా గానం చేసేది. మార్గశీర్ష మాసంలో అలా రోజుకొక్క పాశురం చొప్పున ఆమె గానం చేసిన పాశురాలే 'తిరుప్పావై'! ఆవిడ పాడిన విరహగీతాల సంకలనమే 'నాచ్చియార్‌ తిరుమొళి'!

Preview download free pdf of this Telugu book is available at Amutkamalyada Victory Publishers
Comment(s) ...

I am not able to copy this pdf to my iphone 6S. Can you please help me or give me steps to copy it to my iphone.