• Amuktamalyada
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆముక్తమాల్యద

    Amuktamalyada

    Pages: 128
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తాత్త్విక చింతనను కలిగించి, సచ్ఛీలం వైపు పయనింపజేసే ప్రబంధాల్లో ముందుగా పేర్కొనదగింది 'ఆముక్తమాల్యద'. వైష్ణవ భక్తిని విశద పరిచే ఈ ప్రబంధం శ్రీకృష్ణ దేవరాయల వారి కవితా ప్రతిభకీ, భక్తి తత్పరతకీ, లోకజ్ఞతకీ, ప్రకృతి ప్రీతికీ, సామాజిక అనుశీలనకీ నిలువుటద్దం. ఆరుద్ర అన్నట్లు, నాయిక ఆధారంగా ''ఆముక్తమాల్యద'' అనే పేరు పెట్టబడిన మొట్టమొదటి ప్రబంధం కూడ. ఇంతటి గొప్ప ప్రబంధాన్ని వచనంలో రాశారు కోడూరు శ్రీ పాండురంగారావు గారు.

పాండురంగారావు గారు కేవలం వచనంలో చెప్పుకొని పోకుండ 'నాటకీయశైలి'ని ప్రయోగించం మరో విశేషం. పాఠకులకు కావ్య విశేషాలను అందించే ఉద్దేశంతో అథస్సూచికలో వివరణలు ఇవ్వటం ఈ రచనలోని ఇంకో విశేషం.

''ఆముక్తమాల్యద'' ప్రబంధం ఒక పట్టాన పూర్తిగా అవగతమవదు. దాని వైభవాన్ని అర్థం చేసుకోవడనికి పాండురంగారావు గారి ఈ రచన ఉపకరిస్తుంది. వీరి వచన రచన చదివిన తర్వాత రాయల వారి ''ఆముక్తమాల్యద'' చదివితే సంపూర్ణ రసానందం పొందుతారు. మూల రచన చదవలేక పోయినా పాండురంగారావు గారి రచన చదివినా రాయలు అర్థమవుతాడు. అతని ప్రతిభ అర్థమవుతుంది.

ఇది మంచి రచన. సరైన సమయంలో వచ్చిన రచన. అందుకు అభినందనలు.

- ద్వా.నా. శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Amuktamalyada