• Ammako Uttaram
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మకో ఉత్తరం

    Ammako Uttaram

    Publisher: Ganti Prachuranalu

    Pages: 144
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరోసారి, మరో కథానికల సంపుటితో మీ ముందున్నాను. ఇది నా ఏడవ కథానికల సంపుటి. ఈ కథలన్నీ కూడా వివిధ పత్రికల పోటీలకి పంపినవే. ఇందులో కొన్నింటికి మొదటి బహుమతులొస్తే కొన్నింటికి కన్సొలేషన్ వచ్చింది. మరి కొన్ని సాధారణ ప్రచుణకి నోచుకున్నాయి. ఇందులో మొత్తం పదహారు కథలున్నాయి.

ఈ కథల్లో కన్నీటి బొట్లున్నాయి, కంటిపాపల్లో మెరుపులున్నాయి.

అన్ని కథలకి నేపథ్యం వార్తాపత్రికలు, టీవీలోని సంఘటనలు. వాటి ఆధారంగా రాసినవే. ఈ కథలన్నీ కూడా వివిధ పత్రికల్లో వచ్చినవి.

మా తండాల్లో ఆడపిల్లల జీవితాలు ఎంతో చవక. ఎందుకంటే మా తండాల్లో అమ్మాయిల జీవితాల దేవుడు రాయడు. అలా అలా ఆకాశంలోంచి ఊడిపడ్డవాళ్ళం అనుకున్న తండా అమ్మాయి కథ - మాట్లాడడం నేర్పిన అమ్మ మూగపోతున్న నాకు ఓదార్పు నిస్తుంది. దానికోసం అమ్మకి ఉత్తరం రాసిన ఓ కూతురి కథ - తండ్రికి ఆల్జీమర్స్‌ని తెలుసుకున్న ఆమె తన ఇంట్లో ఉంచుకోడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఆమె కథ - ఆకాశం కప్పుగా ఉన్న చెట్ల కింద చదువుతున్న ఆ విద్యార్థుల క్లాసుల మధ్య గోడలు, గోడల మధ్య క్లాసులు మనుషుల మధ్య గోడలు భరించలేక వెళ్ళిపోదామనుకున్న వాళ్ళ కథ - వయసు అడ్డు కాదు, యాభై దాటిన వయసులో ఎంబీయే లో ఆమె చేరితే, డెబ్బై దాటిన వయసులో పెయింటింగ్ బ్రష్ పట్టుకున్న అతను జీవితానికి రంగులు అద్దుకుంటున్న చిత్రకారుడి కథ - ఇలాంటి కథలెన్నో ఉన్నాయి ఈ సంపుటిలో.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Ammako Uttaram