• Amerikaamedy Naatikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికామెడీ నాటికలు

    Amerikaamedy Naatikalu

    Pages: 185
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ర౦గ౦ మీద శ్రీరంగ౦

రంగ౦ అంటే బర్మా రాజధాని కాదు. నాటకర౦గ౦. శ్రీరంగ౦ అన్నది మా యింటిపేరు. తాను రాసిన నాటికలలో కొన్నిటిని అచ్చు వేయిస్తున్నానని చెప్పి ఆ గ్రంథానికో చిన్న ఉపోద్ఘాత౦ రాయమన్నారు రచయిత చిట్టెన్ రాజుగారు. సరే అన్నాన్నేను.

అన్నానే గాని తీరా రాయడానికి కూర్సునేసరికి ఏ౦ రాయాలో తోచడం లేదు. ఈ నాటికలన్నీ రంగస్థలం మీద రక్తి కట్టాయని విన్నానుగాని స్వయంగా ఏ ఒక్క ప్రదర్శననూ చూడలేదు. "ఆప్తవ్యాం ప్రమాదం" అంటారు. చూసిన మిత్రులు మెచ్చుకున్నారన్నమాట నిజం. నేను కూడా నీటిని చదువుతూ ప్రదర్శనెలా ఉ౦టు౦దో ఆ విషయ౦ ఊహించుకొన్నాను.

ఇక నవలలుగాని- కథానికా సంపుటాన్నిగాని మనం చదువుకొని సొరుగులో పెట్లేస్తాం. నాటకము- నాటిక అలా కాదు. వాటికి ర౦గస్ధల౦ మీదనే ప్రాణం రావాలి. ప్రదర్శనం ప౦డి౦దా లేదా? - అదీ మొదటి టెస్టు. ఈ పరీక్తలో చిట్టెన్ రాజుగారు ఫస్టుగా పాసయ్యారు.

ఇ౦కా ఎన్నెన్నో గీటురాళ్ళున్నాయో అన్నిటి గురించి నాకు తెలుసునని ఎప్పుడూ అనుకోలేదు. తెలిపిన కొన్నిటిలో కొన్నిటికైనా ఇక్కడ ఉపయోగించి ఉచ్చులు వేయదలుచుకోలేదు.

ఒకే ఒక లిట్మస్ టెస్ట్ ఉటంకించి ఈ ఉపోద్ఘాతాన్ని ముగిస్తాను. మానువుడికి ఎన్ని సినిమాలు వచ్చినా, టి.వీ.లు వచ్చినా, వీడియోలు వచ్చినా ఆది ను౦చి అతనికి నాటక రంగమే ప్రాణవాయుపుగా పనిచేస్తో౦ది. నాటక ప్రదర్శనంలో ర౦గస్థల౦ మీద పాత్రకూ, ఆడిటోరియంలోని శ్రోతలకు ఒక సజీవ సంబంధం ఉ౦టు౦ది. రచయిత జీవితసూత్రాలను సృష్టిస్తేనే ప్రదర్శన౦ ఫలప్రదమవుతు౦ది. చిట్టేన్ రాజుగారు ఆ పవి చేశారని నేనసుకుంటాను.

ఇ౦తటితో ఉపోద్ఘాతం సమాప్తం. ఉంటాను.

- శ్రీశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Amerikaamedy Naatikalu