• America Telugu Kathanika Volume 9
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50.004
    100.008
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా తెలుగు కథానిక - తొమ్మిదవ సంకలనం

    America Telugu Kathanika Volume 9

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు అమెరికనుల జీవితాలలో రకరకాల సంఘటనలను గుర్తుచేసే సాహిత్య రూపకల్పనలివి. చిన్న చిన్న కథలు. మనం రోజూ ఇప్పుడు మాట్లాడుకునే తెలుగు కాకపోయినా, మనం చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు జ్ఞాపకం తెచ్చే భాషలో వ్రాయబడిన రచనలు. కొంత ఆంగ్లభాషా నుడికారం మిళితమైన సొంపుగల మహాంధ్రంలో వ్రాసిన రచనలు. మనలో మామూలుగా కలిసి తిరిగే వ్యక్తులే వీటిలో పాత్రలుగా కనిపిస్తారు. అభూత కల్పనలు లేవు. నిజమే కాబోలు అని మన ప్రవృత్తులలోనూ మనకు తెలియనవి, తెలిసినివి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. తెలుగు తనం, తెలుగు సంస్కృతి మనలో జీర్ణించుకుని ఉన్నాయని వలస దేశపు వింత పోకడలు మనలని అంటుకోవని ధైర్యంగా ముందుకు సాగేవారు కొంతమంది, క్లిష్టపరిస్థితులలో చివరకు మిగిలేది, ఆదుకొచ్చేది మన సంస్కృతి, సంస్కారాలేనని నమ్మేవాళ్లు కొంతమంది, భవిష్యత్తుని నిలబడి ఎదుర్కొంటూ తమకు కావలసిన వరవడిలో దాన్ని తిప్పుకుంటూ ప్రయాణం సాగించాలనుకునేవారు కొంతమంది అన్ని రకాల వ్యక్తులని ఈ కథలలో చూచాయగా చూస్తాం.

ఇప్పటివరకూ దీనితో కలిపి వంగూరి ఫౌండేషను తొమ్మిది కథాసంకలనాలని తీసుకొచ్చింది. నూటయాభైకి పైగా కథలు ఈ సంకలనాలలో సమకూర్చబడ్డాయి. ప్రస్తుత సంకలనంలో కొన్ని కథలు ఈమాట, తెలుగునాడి, తెలుగుజ్యోతి, సుజనరంజని, అమెరికాభారతి పత్రికలలో ప్రచురించబడ్డయి. ఆ పత్రికల వారికి మా కృతజ్ఞత.

మరికొన్ని వంగూరి ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న కథల పోటీలకు సమర్పించబడినవి, బహుమతులందుకొన్నవి. 1995లో ప్రారంభించబడిన ఈ కథానిక ప్రచురణ కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగటానికి కారణం మనలో ఉన్న రచయితల ఉత్సాహ, ప్రోద్బలాలే. ముందు ముందు కూడ రచయితల, సంపాదకుల సహకార ప్రోద్బలాలు ఉంటాయని ఆశ.

- పెమ్మరాజు వేణుగోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at America Telugu Kathanika Volume 9